తెలంగాణ

telangana

కాల్పుల విరమణవైపు ఇజ్రాయెల్​- పాలస్తీనా అడుగులు!

By

Published : May 20, 2021, 9:03 PM IST

యుద్ధం అంచున ఉన్న పాలస్తీనా-ఇజ్రాయెల్​ మధ్య ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. కాల్పుల విరమణపై మరో 24 గంటల్లోపు ఓ స్పష్టత వస్తుందని తెలుస్తోంది.

expectations-for-truce-rises-amid-cease-fire-speculations-between-israel-and-palestine
కాల్పుల విరమణవైపు ఇజ్రాయెల్​- పాలస్తీనా అడుగులు

దాడులతో గత కొన్ని రోజులుగా అట్టుడుకుతున్న గాజాలో శాంతి స్థాపనపై ఆశలు చిగురిస్తున్నాయి. యుద్ధం అంచున ఉన్న పాలస్తీనా- ఇజ్రాయెల్​ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు చేపట్టిన చర్చలు ఫలితాల్ని ఇస్తున్నట్టు తెలుస్తోంది. మరో 24 గంటల్లో కాల్పుల విరమణపై ఓ స్పష్టత వచ్చే అవకాశముందని చర్చలతో సంబంధం ఉన్న అధికారులు పేర్కొన్నారు.

రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు మొదలైనప్పటి నుంచి వాటి మధ్య సయోధ్యకు ఈజిప్ట్​ తీవ్రంగా కృషి చేస్తోంది. కానీ ఇన్ని రోజులు అవి ఫలితాల్ని ఇవ్వలేదు. అయితే కాల్పుల విరమణ గురించి ఇజ్రాయెల్​పై అమెరికా కూడా ఒత్తిడి పెంచుతోంది. ఈ నేపథ్యంలోనే.. 24 గంటల్లో ఓ స్పష్టత వచ్చే అవకాశముందని ఈజిప్ట్​కు చెందిన ఓ నిఘా అధికారి పేర్కొన్నారు.

మరోవైపు.. ఇజ్రాయెల్​ ప్రధానమంత్రి బెంజమిన్​ నెతన్యాహు, మరికొద్ది గంటల్లో తన భద్రతా మండలితో సమావేశంకానున్నారు. కాల్పుల విరమణపై ఇందులో చర్చించే అవకాశముంది. ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సూచనలకు ఈ వార్త ఊతమందిస్తోంది.

పాలస్తీనా నిరసనకారులు, ఇజ్రాయెల్​ పోలీసులు మధ్య ఇటీవలే చెలరేగిన ఘర్షణలు రెండు దేశాలను యుద్ధం అంచుకు నెట్టాయి. అప్పటి నుంచి ఇజ్రాయెల్​ మిలిటరీ- హమాస్​ ఉగ్రవాదులు ఒకరిపై ఒకరు రాకెట్​ దాడులతో విరుచుకుపడుతున్నారు. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో 227మంది పాలస్తీనావాసులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 64మంది చిన్నారులు, 38మంది మహిళలు ఉన్నారు. 1,620మందికిపైగా మంది క్షతగాత్రులయ్యారు. 20మంది హమాస్​, ఇస్లామిక్​ జిహాద్​ సభ్యులు మరణించారు. మొత్తం మీద 58వేల మంది ఇళ్లను విడిచి వసలవెళ్లిపోయారు. ఈ పరిణామాల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం లభిస్తే.. గాజా ప్రజలు ఊపిరిపీల్చుకున్నట్టు అవుతుంది.

ఇదీ చూడండి:-ఇజ్రాయెల్‌-పాలస్తీనా వివాదానికి రాజకీయ కోణం

ABOUT THE AUTHOR

...view details