ఇజ్రాయెల్‌కు దాదాపు 735 మిలియన్ డాలర్లు విలువైన ఆయుధాలను విక్రయించనుంది అమెరికా. సంబంధిత ప్రతిపాదనకు అధ్యక్షుడు జో బైడెన్ పాలకవర్గం ఆమోదం తెలిపినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి.
ఇందులో లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగల ప్రత్యక్ష దాడులు చేసే ఆయుధాలు, మందుగుండు సామగ్రి సహా, జీబీయూ-39 బాంబులు ఉన్నట్లు ది వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది.
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య సంఘర్షణ జరుగుతున్న సమయంలో.. ఈ ఆయుధాల విక్రయం జరుగుతుండటం గమనార్హం. ఈ నిర్ణయంపై.. బైడెన్ వర్గంలోని కొందరు డెమొక్రాట్లు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇజ్రాయెల్ సైన్యం, గాజాలోని పాలస్తీనా ఉగ్రవాదుల మధ్య సంఘర్షణకు వారం ముందే( మే 5న).. ఈ ఆయుధాల అమ్మకం ప్రతిపాదన కాంగ్రెస్‌కు పంపించినట్లు జిన్ఙువా వార్తా సంస్థ తెలిపింది.