Walmart Plane Crash : అమెరికా మిసిస్సిపీ రాష్ట్రంలోని టుపెలోలో వాల్‌మార్ట్ స్టోర్‌కు విమాన బెదిరింపు వచ్చింది. విమానంతో వాల్‌మార్ట్ స్టోర్‌ను ఢీకొంటానని ఓ పైలట్ బెదిరింపులకు పాల్పడ్డారు. చిన్న విమానంతో ఆ స్టోర్ చుట్టూ ఆకాశంలో చక్కర్లు కొట్టాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వాల్‌మార్ట్ స్టోర్ సహా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయించారు.
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ప్రారంభమైన విమాన ప్రయాణం మూడు గంటలకుపైగా సాగింది. పైలట్‌తో నేరుగా మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. తాము అనుమతి ఇచ్చే వరకు ఆ ప్రాంతంలోకి ఎవ్వరూ వెళ్లవద్దని పోలీసులు ఆదేశించారు. పరిస్థితిని రాష్ట్ర అత్యవసర విపత్తు విభాగం పరిశీలిస్తోందని.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విమానంలో ఇంధనం అయిపోవడం వల్ల చివరకు మిసిస్సిపీ సమీపంలోని పొలంలో విమానాన్ని ల్యాండ్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పైలట్‌ను అదుపులోకి తీసుకున్నట్లు గవర్నర్ వెల్లడించారు. .