తెలంగాణ

telangana

ETV Bharat / international

ఒక్క మగాడు.. 105 పెళ్లిళ్లతో గిన్నిస్ రికార్డ్.. ఎవరికీ విడాకులు ఇవ్వకుండానే..

ఏ మనిషి అయినా సాధారణంగా ఒక పెళ్లి చేసుకుంటాడు. కొందరైతే అంతకుమించి రెండు.. మూడు.. ఓ పది పెళ్లిళ్ల వరకు చేసుకున్న వాళ్లను చూసుంటాం.. కానీ ఈ వ్యక్తి.. అందరిలా కాకుండా 105 మంది మహిళలను పెళ్లి చేసుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం సంపాదించాడు.

US Man Married Over 100 Women In 3 Decades
US Man Married Over 100 Women In 3 Decades

By

Published : Apr 12, 2023, 3:12 PM IST

ఒక్క పెళ్లి చేసుకోవడానికే నానా తంటాలు పడుతుంటారు కొద్దిమంది. వివాహాలు కాక 'పెళ్లి కాని ప్రసాద్​'లుగా మిగిలిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఈయన మాత్రం అందుకు విరుద్దం. ఒకటి.. రెండు.. కాదు ఏకంగా 105 వివాహాలు చేసుకుని.. గిన్నిస్​ బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం సంపాదించుకున్నాడు. ఏంటీ.. 105 పెళ్లిళ్లా? అసలు అన్ని వివాహాలు ఎలా చేసుకున్నాడని ఆశ్చర్యపోతున్నారా? అయితే అతడి గురించి తెలుసుకోండి!

అమెరికాకు చెందిన జియోవన్నీ విజ్​లియొట్టో అనే వ్యక్తి 1949 నుంచి 1981 మధ్య 105 మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు. ఇందులో విచిత్రం ఏంటంటే.. ఇప్పటివరకు పెళ్లి చేసుకున్న 105 మందిలో ఏ మహిళకు కూడా విడాకులు ఇవ్వలేదు. దీంతో అత్యధిక వివాహాలు చేసుకున్న వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం సంపాదించుకున్నాడు. విజ్​లియొట్టో 105 మంది మహిళలను మోసం చేసే పెళ్లి చేసుకున్నాడు. ప్రతిసారి పేరు మార్చుకుని.. దొంగ ఆధారాలతో వివాహం చేసుకున్నాడు. మార్కెట్లలోని మహిళలను ఎక్కువగా పెళ్లి చేసుకున్న విజ్​లియొట్టో.. వారిని కలిసిన తొలిరోజే ప్రపోజ్ చేసేవాడు. అనంతరం మహిళలను నమ్మించి పెళ్లి చేసుకుని.. వారి నగదు, ఆభరణాలతో పారిపోయేవాడు. ఎత్తుకెళ్లిన వస్తువులను విక్రయించి.. కొత్త వ్యక్తుల కోసం వెతికేవాడు. ఇలా విజ్​లియొట్టో ఇప్పటివరకు అమెరికాలోని 27 రాష్ట్రాలు, 14 వివిధ దేశాలకు చెందిన మహిళలను పెళ్లి చేసుకున్నాడు. అతడు పెద్ద మోసగాడని.. జియోవన్నీ విజ్​లియొట్టో ఇది కూడా అతడి అసలు పేరు కాదని బాధితులు ఆరోపిస్తున్నారు.

105 మందిని మోసం చేసి పెళ్లి చేసుకున్న విజ్​లియొట్టో.. చివరి భార్యకు చిక్కాడు. శారోన్​ క్లార్క్​ అనే మహిళ.. ఇతడి మోసాన్ని బయటపెట్టింది. ఆమెను మోసం చేసి పారిపోగా.. అతడిని వెతికి మరీ ఫ్లోరిడాలో పట్టుకుని పోలీసులకు అప్పగించింది క్లార్క్​. అతడు 53 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు.. 1981 డిసెంబర్​ 28న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోసం, దొంగతనం కేసుల కింద అతడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు.

కోర్టు విచారణకు హాజరైన విజ్​లియొట్టో.. తన పేరు నికోలై పెరుస్కోవ్​ అని వెల్లడించాడు. అప్పటివరకు 50 గుర్తింపులను మార్చి మోసానికి పాల్పడినట్లు తప్పును ఒప్పుకున్నాడు. రెండేళ్ల పాటు విచారణ​ సాగింది. 1983 మార్చి 23న తీర్పు వెలువడింది. అతడికి 34 ఏళ్ల జైలు శిక్షతో పాటు సుమారు రూ. 2.75 కోట్ల జరిమానాను విధించింది కోర్టు. కొన్నేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన విజ్​లియొట్టో.. 1991లో 61 ఏళ్ల వయసులో మెదడు సంబంధిత వ్యాధితో మరణించాడు.

ఇవీ చదవండి :'మోదీజీ మా దేశాన్ని ఆదుకోండి'.. జెలెన్​స్కీ విజ్ఞప్తి

చైనాలో ఇసుక తుపాను బీభత్సం.. ఆకాశంలో ధూళి మేఘాలు.. రోడ్లపై మట్టి దిబ్బలు

ABOUT THE AUTHOR

...view details