తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఏలియన్స్​' నిజాలను అమెరికా దాస్తోందా?.. సైంటిస్ట్​లు అదే పనిలో ఉన్నారా? - ఏలియన్లపై అమెరికా మాజీ అధికారి డేవిడ్ గ్రుష్​​

UFO Aliens : ఏలియన్లపై సమాచారాన్ని అగ్రరాజ్యం దాచిపెడుతుందా?.. ఇప్పటికే అమెరికా వద్ద గ్రహాంతరవాసులకు సంబంధించిన సమాచారం ఉందా? మానవేతర అవశేషాలపై యూఎస్‌ శాస్త్రవేత్తలు పరిశోధన కూడా చేస్తున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం ఇస్తున్నారు అమెరికాకు చెందిన మాజీ నిఘా అధికారి. అమెరికా పార్లమెంట్‌కు ఈయన ఇచ్చిన వాంగ్మూలం.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

David Grusch UFO Aliens  Whistleblower Claims
David Grusch UFO Aliens Whistleblower Claims

By

Published : Jul 27, 2023, 12:18 PM IST

UFO Aliens : ఏలియన్లు ఉంటాయనే ప్రచారం జరిగే ఫ్లయింగ్ సాసర్లు యూఎఫ్​ఓలపై తమ దేశం కొన్ని విషయాలను దాచిపెడుతోందని అమెరికా మాజీ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ అధికారి డేవిడ్ గ్రుష్ బాంబు పేల్చారు. అమెరికా పార్లమెంటు కాంగ్రెస్‌కు వాంగ్మూలం ఇచ్చిన ఆయన కొన్ని ఆధారాలను సమర్పించారు.

Unidentified Aerial Phenomena : అన్​ఐడెంటిఫైడ్​ ఫ్లయింగ్​ ఆబ్జెక్ట్- యూఎఫ్​ఓలను ఐడెంటిఫైడ్ ఏరియల్​ ఫెనోమినన్- యూఏపీ‍లుగా అమెరికాలో పిలుస్తారు. టాస్క్‌ఫోస్క్‌ మిషన్‌కు సంబంధించిన అత్యంత క్లాసిఫైడ్ ప్రోగ్రామ్‌లను గుర్తించమని యూఏపీలపై ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ అధిపతి తనను 2019లో అడిగారని గ్రుష్ చెప్పారు. ఆ సమయంలో యూఎస్​ గూఢచారి ఉపగ్రహాలను నిర్వహించే నేషనల్ రికనైసెన్స్ ఆఫీస్‌కు ఈ విషయాన్ని వివరించినట్లు ఆయన చెప్పారు. యూఏపీ క్రాష్ రిట్రీవల్, రివర్స్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌కు తనకు అనుమతి రాలేదన్నారు.

UFO US Government : గ్రహాంతర వాసుల గురించి అమెరికా ప్రభుత్వం వద్ద సమాచారం ఉందా అనే ప్రశ్నకు డేవిడ్ గ్రుష్ చెప్పిన సమాధానం ఆశ్చర్యానికి గురిచేసింది. 1930ల నుంచే మానవేతర కార్యకలాపాల గురించి అమెరికా తెలుసుకునే అవకాశం ఉందన్నారు. మనుషులే కాదు ఇతర గ్రహాలపైనా జీవులు ఉన్నాయని ఇందుకు సంబంధించి అగ్రరాజ్యం అమెరికా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయనిడేవిడ్ గ్రుష్ తెలిపారు. అందులో నుంచి సేకరించిన మానవేతర అవశేషాలపై సైతం పరిశోధనలు కొనసాగుతున్నాయని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను నిఘా వర్గాలు గతంలోనే ప్రభుత్వానికి సమర్పించాయని తెలిపారు. క్రాష్డ్‌ క్రాఫ్ట్స్‌, దాని పైలట్లు నిజమేననని ఆయన సమాధానం ఇచ్చారు. దీని గురించి తనకు ప్రత్యక్ష సమాచారం ఉందని తెలిపారు. దశాబ్దాలుగా ఇందుకు సంబంధించిన పరిశోధనలు కొనసాగుతున్నాయని తెలియజేశారు.

David Grusch UFO Whistleblower Claims : జూన్‌లోనే ఆయన అమెరికా ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. తాను ప్రత్యక్షంగా వాటిని చూడకపోయినప్పటికీ, హైలెవల్‌ ఇంటెలిజెన్స్‌ అధికారుల నుంచి తనకు సమాచారం ఉందని తెలియజేశారు. గ్రుష్‌ ఆరోపణలను పెంటగాన్‌ తోసిపుచ్చింది. పరిశోధకులకు గ్రహాంతర వాసుల గురించి ఎలాంటి ఆధారాలు దొరకలేదని రక్షణ అధికారి ఒకరు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details