తెలంగాణ

telangana

By

Published : Jan 29, 2023, 6:26 PM IST

ETV Bharat / international

రిషి సునాక్ మాస్టర్​ స్ట్రోక్​.. సొంత పార్టీ ఛైర్మన్​పైనే వేటు.. ఆ తప్పు చేశారని..

సొంత పార్టీ ఛైర్మన్​​ నదీమ్ జహావిని కేబినెట్ మంత్రి పదవి నుంచి తొలగించారు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్. పన్ను చెల్లింపుల విషయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నారు.

uk-pm-rishi-sunak-sacks-tory-party-chief-over-tax-penalty-row
కన్జర్వేటివ్ పార్టీ చైర్మన్ పదవి నుంచి తొలగించిన రిషి సునాక్

సొంత పార్టీ ఛైర్మన్​పైనే బ్రిటన్​ ప్రధాన మంత్రి రిషి సునాక్ వేటు వేశారు. కన్జర్వేటివ్ పార్టీ ఛైర్మన్​గా, కేబినెట్​ మినిస్టర్​గా ఉన్న ​నదీమ్ జహావిని ప్రభుత్వ పదవి నుంచి తొలగించారు. పన్ను చెల్లింపుల విషయంలో జహావి మోసాలకు పాల్పడినందుకు ఈ చర్యలు తీసుకున్నారు. నదీమ్ జహావిని మంత్రి​ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఆదివారం సునాక్ పేర్కొన్నారు. ప్రభుత్వ బాధ్యతల్లో ఉండి నదీమ్ నిబంధనలు ఉల్లఘించారని వెల్లడించారు.

గత కొద్ది రోజులుగా జహావి పన్ను చెల్లింపుల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లుగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. పదవి నుంచి ఆయన్ను తొలగించాలని డిమాండ్​ చేస్తున్నాయి. దీంతో జహావిపై వచ్చిన ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు ప్రధాని రిషి సునాక్​. విచారణ పూర్తి చేసిన దర్యాప్తు బృందం.. జహావిపై వచ్చిన ఆరోపణలు నిజమేనని ప్రధానికి నివేదిక సమర్పించింది. దీంతో​ సునాక్ చర్యలు తీసుకున్నారు.

"మీరు మినిస్ట్రీయల్​ కోడ్​ నిబంధనలు ఉల్లంఘించారు. విచారణ కమిటీ అదే సృష్టం చేసింది. మిమ్మల్ని ప్రభుత్వ పదవుల నుంచి తొలగిస్తున్నాను." అని జహావికి రాసిన లేఖలో సునాక్​ పేర్కొన్నారు. అయితే.. గత ఐదేళ్లుగా ప్రభుత్వంలో ఉంటూ జహావి సాధించిన విజయాల పట్ల ఆయన గర్వపడాలని, కొవిడ్​ సమయంలో ఆయన చేసిన సేవలు అభినందనీయమని సునాక్​ కొనియాడారు. టీకా సేకరణ, విస్తరణ కార్యక్రమాన్ని జహావి విజయవంతంగా పర్యవేక్షించారని ప్రశంసించారు.

"నేను ఒక మంత్రిగా అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వహించాను. పన్ను చెల్లింపుల్లో చిన్న పొరపాటు జరిగి ఉండొచ్చు. అయితే అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు." అని జహావి తెలిపారు. గత వారం ఆయనపై దర్యాప్తుకు చేసేందుకు ఓ బృందం ఏర్పాటును జహావిపై స్వాగతించారు. తాను అన్ని విషయాలు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
నదీమ్ జహావి ఇరాక్‌లో జన్మించిన బ్రిటిష్ రాజకీయ నాయకుడు. ఆయన కన్జర్వేటివ్ పార్టీ ఛైర్మన్‌గా 2022 నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎటువంటి శాఖ లేకుండా కేబినెట్​ మినిస్టర్​గా ఉన్నారు. ఈయన పలువురు ప్రధాన మంత్రుల కింద వివిధ హోదాల్లో పని చేశారు.

For All Latest Updates

TAGGED:

rishi sunak

ABOUT THE AUTHOR

...view details