తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఫోబియా'కు స్పైడర్​మ్యాన్​ 'ట్రీట్​మెంట్​'

సాలెపురుగు, చీమలు... వీటిని మనం నిత్యజీవితంలో చూస్తూనే ఉంటాం. కానీ వీటికీ భయపడే వారు ఎందరో. ఈ ఫోబియాను తగ్గించుకోవడానికి చాలా మంది రకరకాల చికిత్సలు తీసుకుంటారు. కానీ స్పైడర్​మ్యాన్​, యాంట్​మ్యాన్​ సినిమాలు చూస్తే చాలంటున్నారు పరిశోధకులు.

'ఫోబియా'కు స్పైడర్​మ్యాన్​ 'ట్రీట్​మెంట్​'

By

Published : May 11, 2019, 9:01 PM IST

'ఫోబియా'కు స్పైడర్​మ్యాన్​ 'ట్రీట్​మెంట్​'

స్పైడర్​మ్యాన్, యాంట్​మ్యాన్​​... మార్వెల్​ సినిమాల్లో ఈ రెండూ పెద్ద సంచలనాలు. ఎన్నో ఏళ్లుగా స్పైడర్​మ్యాన్​ తన సాహసాలతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు. యాంట్​మ్యాన్​కూ అభిమానులు ఎక్కువే. ఇలాంటి సినిమాలు కేవలం ఆహ్లాదాన్నే పంచుతాయనుకుంటే మీరు పొరబడ్డట్టే అంటున్నారు ఈ ఇజ్రాయెల్​ సైకాలజిస్టులు.

ఇజ్రాయెల్​కు చెందిన ప్రొఫెసర్లు డా. యాకొవ్​ హోఫ్​మన్​, మెనచెమ్​ బెన్​ ఎజ్రా... మార్వెల్​ సినిమాలకు వీరాభిమానులు. 2018లో విడుదలైన 'యాంట్​మ్యాన్​ అండ్​ ద వాస్ప్​' చిత్రాన్ని చూసిన ఎజ్రాకు వింత ఆలోచన వచ్చింది. ఇలాంటి సినిమాలు సాలెపురుగులు, చీమలంటే విపరీతమైన భయం ఉండే వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్న ఆలోచనతో ఈ ఇద్దరు వెంటనే పరిశోధన మొదలు పెట్టారు. ఫోబియా ఉన్నవారిపై ఈ సినిమాలు సానుకూల ప్రభావం చూపిస్తాయని గుర్తించారు.

"యాంట్​మ్యాన్, స్పైడర్​మ్యాన్​ సినిమాల ప్రభావంపై పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నాం. సాలెపురుగులు- స్పైడర్​మ్యాన్​... చీమలు- యాంట్​మ్యాన్​కు సినిమాకు సంబంధించి రెండు పరిస్థితులు ఎంచుకున్నాం.​​ ఆ సినిమాలు చూడక ముందు, చూసిన తర్వాత పురుగులు, చీమలపై వారికున్న ఫోబియా గురించి ప్రశ్నించాం. వారిలోని ఫోబియా కొంతమేర తగ్గిందని గుర్తించాం. స్పైడర్​మ్యాన్​ సినిమా 7 సెకన్లు చూస్తే 20శాతం ఫోబియా తగ్గుతుంది. "

--డా. యాకొవ్​ హోఫ్​మన్​, బార్​- ఐలన్​ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్​

పరిశోధనలో భాగంగా 424 మందిని పరీక్షించినట్టు చెప్పారు హోఫ్​మన్​, ఎజ్రా. వీరి పరిశోధన ఇటీవలే 'ఫ్రాంటియర్స్​ ఇన్​ సైక్యాట్రీ' పత్రికలో ప్రచురితమైంది. అయితే ఇది కేవలం ప్రాథమిక నివేదికేనని... మరింత లోతైన పరిశోధన చేయాల్సి ఉందన్నారు ప్రొఫెసర్లు.

ఇదీ చూడండి: అంతరిక్ష వీధిలో వేసవి సెలవులు గడపొచ్చు!

ABOUT THE AUTHOR

...view details