Shooting In Mexico: మెక్సికోలో దుండగులు మరో సారి కాల్పులకు తెగబడ్డారు. బుధవారం రాత్రి గ్వానాజువాటోలోని ఓ బార్లో సాయుధులు చొరబడి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బార్‌లోని వెయిటర్స్‌తో సహా.. మొత్తంగా 9 మంది చనిపోయారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారని పోలీసు అధికారులు తెలిపారు. గాయపడిన వారి పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు వెల్లడించారు.
బార్లో షూటింగ్.. 9 మంది మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు - మెక్సికో బార్లో కాల్పులు
Shooting In Mexico : మెక్సికోలో కాల్పులు కలకలం సృష్టించాయి. గ్వానాజువాటో రాష్ట్రంలోని ఓ బార్లో జరిగిన కాల్పుల్లో 9 మంది మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
మెక్సికోలో కాల్పులు
బార్లో రక్తంతో రాసిన కొన్ని పోస్టర్లు కనిపించాయని అధికారులు తెలిపారు. ఈ దాడి శాంటా రోసా డి లిమా గ్యాంగ్ చేసినట్లుగా సంతకాలు చేశారని అధికారులు తెలిపారు. ఈ దాడులు స్థానికంగా ఉండే రెండు డ్రగ్స్ ముఠాల మధ్య ఘర్షణ కారణంగా జరిగినట్లు తెలిపారు. బార్ యజమానులు శాంటా రోసా డి లిమా గ్యాంగ్‌కు కాకుండా.. జాలిస్కో అనే మరో గ్యాంగ్‌కు మద్దతు తెలిపుతున్నారనే కోపంతోనే దాడి చేసినట్లు వారి సందేశాలు ఆధారంగా తెలుస్తుందని పోలీసులు తెలిపారు.
Last Updated : Nov 11, 2022, 10:56 AM IST