తెలంగాణ

telangana

ETV Bharat / international

మరియుపోల్​కు పుతిన్​.. ఆక్రమించుకున్నాక తొలిసారి.. స్వయంగా కారు నడుపుతూ.. - పుతిన్​ లేటెస్ట్ న్యూస్

ఉక్రెయిన్‌లో ఆక్రమించుకున్న ప్రాంతాలను గత ఏడాది తమ దేశంలో విలీనం చేసుకున్నాక రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తొలిసారి కీలక నగరం మరియుపోల్‌లో పర్యటించారు. ఈ తీర ప్రాంత నగరాన్ని గత ఏడాది మే నెలలో రష్యా సేనలు కైవసం చేసుకున్నాయి. 9 ఏళ్ల క్రితం ఉక్రెయిన్‌ నుంచి ఆక్రమించుకున్న క్రిమియా ద్వీపాన్ని కూడా పుతిన్‌ సందర్శించారు.

putin latest news
putin latest news

By

Published : Mar 19, 2023, 3:08 PM IST

Updated : Mar 19, 2023, 3:25 PM IST

ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమించుకున్న ప్రాంతంలో తొలిసారి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పర్యటించారు. పోర్టు సిటీ మరియుపోల్‌ను పుతిన్‌ సందర్శించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఉక్రెయిన్‌లోని ఆక్రమించుకున్న ప్రాంతాలను తమ దేశంలో విలీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. ఆ ప్రకటన తర్వాత విలీన ప్రాంతాల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పర్యటించడం ఇదే తొలిసారి. కారును స్వయంగా డ్రైవ్‌ చేసుకుంటూ మరియుపోల్‌ నగరంలో రాత్రివేళ పుతిన్‌ కలియతిరిగారు.

యుద్ధం ఆరంభంలో తీర ప్రాంత నగరం మరియుపోల్‌ కోసం రష్యా-ఉక్రెయిన్‌ దళాల మధ్య మూడు నెలల పాటు భీకరపోరు జరిగింది. ముఖ్యంగా మరియుపోల్‌లోని ఉక్కు కర్మాగారంలో జరిగిన పోరాటం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. గత ఏడాది మే నెలలో ఈ నగరం రష్యా దళాల వశమైంది. 9 ఏళ్ల క్రితం ఉక్రెయిన్‌ నుంచి ఆక్రమించుకున్న క్రిమియా ప్రాంతాన్ని కూడా పుతిన్‌ సందర్శించారు. డాన్‌లోని రోస్టోవ్‌లో స్పెషల్‌ మిలటరీ ఆపరేషన్‌ కమాండ్‌ పోస్టును పుతిన్‌ సందర్శించారు. అక్కడ ఉన్న సైనిక అధికారులతో పుతిన్‌ సంభాషించారు.

క్రిమియాలో పుతిన్​
క్రిమియాలో పుతిన్​
క్రిమియాలో పుతిన్​

పుతిన్​కు అరెస్ట్ వారెంట్​.. స్వాగతించిన ఉక్రెయిన్​
మరోవైపు రష్యా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాకు పిల్లలను చట్టవిరుద్ధంగా పంపించడం సహా ఇతర నేరాలకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​ను బాధ్యుడిగా చేస్తూ అరెస్టు వారెంట్ జారీ చేశామని అంతర్జాతీయ న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆయనతో పాటు రష్యా బాలల హక్కుల కమిషనర్‌ మారియా ల్వోవా బెలోవాకు సైతం ఐసీసీ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసినట్లు తెలిపింది. యుద్ధ నేరాలకు పాల్పడిన ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని అంతర్జాతీయ న్యాయస్థానం ప్రీ ట్రయల్‌ ఛాంబర్‌ తెలిపింది. భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాల్లోని ఓ దేశ అధినేతకు ఇలా అరెస్ట్​ వారెంటు జారీ చేయడం ఇదే తొలిసారి .

పుతిన్ అరెస్ట్ వారెంట్​పై రష్యా ఘాటుగా స్పందించింది. తాము అంతర్జాతీయ న్యాయస్థానాన్ని గుర్తించడం లేదని.. అందువల్ల వాటి చర్యలు చట్టపరంగా చెల్లుబాటుకావని వెల్లడించింది. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్​, ఆ దేశ బాలల హక్కుల కమిషనర్‌ మారియా ల్వోవాకు ఐసీసీ అరెస్ట్ వారెంట్ ఇవ్వడాన్ని ఉక్రెయిన్ స్వాగతించింది.

రష్యాలో జిన్​పింగ్​ పర్యటన
ఇటీవలే ముచ్చటగా ముడోసారి చైనా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన షీ జిన్​పింగ్.. రష్యాలో పర్యటించనున్నారు. రష్యా-ఉక్రెయిన్​తో శాంతియుతంగా చర్చలు జరిపి యుద్ధాన్ని ఆపడమే లక్ష్యంగా షీ జిన్​పింగ్​ రష్యాకు వెళ్లనున్నారు. మూడురోజుల పాటు రష్యాలో పర్యటించనున్న జిన్​పింగ్​.. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ను కలిసి ఉక్రెయిన్​తో యుద్ధం సహా మరిన్ని కీలక అంశాలపై ఆయనతో మాట్లాడనున్నారు.

ఇవీ చదవండి :రష్యాకు జిన్​పింగ్.. ఉక్రెయిన్​తో యుద్ధం ఆపడమే లక్ష్యం!

రష్యా అధ్యక్షుడు పుతిన్​కు అరెస్ట్​ వారెంట్​.. స్వాగతించిన ఉక్రెయిన్

Last Updated : Mar 19, 2023, 3:25 PM IST

ABOUT THE AUTHOR

...view details