తెలంగాణ

telangana

By

Published : Apr 3, 2023, 5:47 PM IST

ETV Bharat / international

గిఫ్ట్​ బాంబుతో రష్యా సైనిక బ్లాగర్​ హత్య.. ఆ యువతి పనే.. విపక్ష నేత మద్దతుతో!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వేళ మరో కీలక సంఘటన చోటుచేసుకుంది. యుద్ధాన్ని ప్రోత్సహించేలా బ్లాగ్‌లు రాస్తున్న వ్యక్తిని ఓ యువతి పేల్చేసింది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌ నగరంలో ఆదివారం రాత్రి జరిగిన పేలుడు ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనతో రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య మరోసారి అగ్గిరాజేసుకుంది.

russia cafe bomb blast
russia cafe bomb blast

రష్యాలో రెండో అతిపెద్ద నగరమైన సెయింట్ పీటర్స్‌ బర్గ్‌లోని ఓ కేఫ్‌లో జరిగిన పేలుడులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధంలో మాస్కోకు మద్దతుగా నిలుస్తున్న రష్యా సైనిక బ్లాగర్ వ్లాడ్లెన్ టాటర్‌స్కీ లక్ష్యంగా ఓ యువతి బాంబు దాడి చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ దాడిలో మరో 32 మంది గాయపడగా అందులో పదిమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు రష్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ ఘటనకు కారణమని అనుమానిస్తున్న 26 ఏళ్ల దార్యా త్రిపోవా అనే యువతిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. టాటర్‌స్కీకి దార్యా త్రిపోవా ఇచ్చిన బహుమతిలో బాంబు ఉందని... దాన్ని ఆమె రిమోట్ సాయంతో పేల్చినట్లు భావిస్తున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి వ్యతిరేకంగా రష్యాలో చేసిన నిరసనల్లో భాగంగా దార్యా త్రిపోవాను గతంలో అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.

డాన్ బాస్‌ ప్రాంతంలో జన్మించిన టాటర్​స్కీ... 2014లో దొంగతనం కేసులో అరెస్టై జైలుకెళ్లాడు. ఉక్రెయిన్‌లోని క్రిమియాను 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న తర్వాత జైలు నుంచి తప్పించుకుని వేర్పాటువాదులతో చేతులు కలిపాడు. తర్వాత సైనిక బ్లాగింగ్ వైపు మళ్లిన టాటర్​స్కీ... యుద్ధాన్ని ప్రోత్సహించేలా చేసిన బ్లాగ్​లతో ప్రసిద్ధి చెందాడు.

పేలుడుకు ముందు కేఫ్​లో మాట్లాడుతున్న టాటర్​స్కీ

ఈ పేలుడుకు ఉక్రెయిన్ సెక్యూరిటీ ఏజెన్సీలే కారణమని రష్యాకు చెందిన ప్రముఖ తీవ్రవాద నిరోధక సంస్థ పేర్కొంది. రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీకి చెందిన అవినీతి వ్యతిరేక ఫౌండేషన్‌కు చెందిన కొంతమంది ఉక్రెయిన్ ప్రత్యేక సంస్థలకు సహకారం అందించినట్లు తెలిపింది. ప్రస్తుతం అరెస్టైన దార్యా త్రిపోవా... నావల్నీ గ్రూపులో క్రియాశీల మద్దతుదారు అని వెల్లడించింది.

పేలుడు అనంతరం కేఫ్​ సమీపంలోని దృశ్యాలు
పేలుడు అనంతరం కేఫ్​ సమీపంలోని దృశ్యాలు

పేలుడు పదార్థాలను తన ద్వారా రవాణా చేస్తున్న విషయం తనకు తెలుసని, అయితే గిఫ్ట్​లో పెట్టిన విషయం తెలియదని యువతి చెప్పినట్లు సమాచారం. టాటర్​స్కీతో ఏం మాట్లాడిందనే అంశంపై ఆమెను అధికారులు ప్రశ్నిస్తున్నట్లు రష్యా మీడియా వర్గాలు చెబుతున్నాయి. యువతి తీసుకొచ్చిన గిఫ్ట్​లో బాంబు ఉందని భద్రతా సిబ్బంది ముందుగానే అనుమానించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 'గిఫ్ట్​ను డోర్ వద్ద వదిలి వెళ్లాలని గార్డ్స్ ఆమెకు సూచించారు. అందులో బాంబు ఉందేమోనని అనుమానించారు. వెంటనే వారు దీనిపై జోకులు వేసి నవ్వుకున్నారు. చివరకు ఆ యువతి గిఫ్ట్​ను తీసుకెళ్లి టాటర్​స్కీకి అందించింది. టాటర్​స్కీ సైతం జోకులు వేస్తూ గిఫ్ట్​ను టేబుల్​పై పెట్టాడు. ఆ తర్వాత అది పేలిపోయింది' అని ప్రత్యక్ష సాక్షి వివరించారు.

కేఫ్​లో పేలుడు దృశ్యాలు

ABOUT THE AUTHOR

...view details