తెలంగాణ

telangana

ETV Bharat / international

'రాజకీయ సభలో పేలుడు వెనుక ఐసిస్ హస్తం​.. ముగ్గురు అరెస్ట్' - పాకిస్థాన్​లో ఆత్మాహుతి దాడిలో 46 మంది మృతి

Pakistan Khyber Pakhtunkhwa Bomb Blast : పాకిస్థాన్​లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఐసిస్ ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఆత్మాహుతి దాడికి నిందితుడు 10 కిలోల పేలుడు పదార్థాలను వినియోగించాడని చెప్పారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.

Pakistan Khyber Pakhtunkhwa Bomb Blast
Pakistan Khyber Pakhtunkhwa Bomb Blast

By

Published : Jul 31, 2023, 1:10 PM IST

Updated : Jul 31, 2023, 3:03 PM IST

Pakistan Khyber Pakhtunkhwa Bomb Blast : పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వాలో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో ఐసిస్‌ ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు. ఈ బాంబు దాడిపై మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఆత్మాహుతి దాడికి దిగిన నిందితుడు.. జమాయత్-ఉలేమా-ఎ-ఇస్లామ్‌-ఫజల్‌ నిర్వహించిన కార్యకర్తల ర్యాలీలో.. ముందు వరుసలో కూర్చున్నాడని వెల్లడించారు. ఆత్మాహుతి దాడి కోసం 10 కిలోల పేలుడు పదార్థాలను వినియోగించారని పేర్కొన్నారు. సరిగ్గా సభా వేదిక వద్ద తనను తాను నిందితుడు పేల్చేసుకున్నట్లు వివరించారు. ఇప్పటివరకు.. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని ఖైబర్‌ పఖ్తుంఖ్వా జిల్లా పోలీసు అధికారి నజీర్ ఖాన్ తెలిపారు.

"ఖైబర్‌ పఖ్తుంఖ్వాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో నిషేధిత ఉగ్రసంస్థ ఐసిస్ హస్తం ఉంది. ఇంకా ఈ పేలుడుపై దర్యాప్తు చేస్తున్నాం. ఆత్మాహుతి దాడిలో మరణించినవారి 38 మృతదేహాలను వారి బంధువులకు అప్పగించాం. మరో ఎనిమిది గుర్తుతెలియని మృతదేహాలు ఇంకా ఆస్పత్రిలో ఉన్నాయి. వారు బంధువులు వస్తే వాటిని అప్పగిస్తాం. బాంబు నిర్వీర్య బృందం ఘటనాస్థలిలో ఆధారాల కోసం గాలిస్తోంది. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు."
--నజీర్ ఖాన్, ఖైబర్‌ పఖ్తుంఖ్వా జిల్లా పోలీసు అధికారి

Pakistan Bomb Blast News : మరోవైపు.. ఖైబర్‌ పఖ్తుంఖ్వాలో పేలుడు ఘటనపై స్పందించారు పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్. ఈ పేలుడుఘటనకు గల బాధ్యులను గుర్తించి శిక్షిస్తామని షరీఫ్ తెలిపారు. అలాగే పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆత్మాహుతి దాడి మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 'ఆత్మాహుతి దాడిలో మరణించినవారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి' అని ఆయన ఆకాంక్షించారు.

పాకిస్థాన్​ అంతటా, ముఖ్యంగా ఖైబర్‌ పఖ్తుంఖ్వాలో ఉగ్రవాద సంఘటనలు పెరగడం మన ప్రాధాన్యాలను పునరాలోచించాల్సిన అవసరాన్ని తెలియజేస్తోందని మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యానించారు. తీవ్రవాద నిర్మూలనపై ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం సాయంత్రం ఖైబర్‌ పఖ్తుంఖ్వాలో జరిగిన దాడిలో 46 మంది మృతి చెందగా.. వంద మందికిపైగా గాయపడ్డారు.

Last Updated : Jul 31, 2023, 3:03 PM IST

ABOUT THE AUTHOR

...view details