తెలంగాణ

telangana

మరోసారి క్షిపణిని ప్రయోగించిన 'కిమ్'​ సర్కార్.. అమెరికా హెచ్చరికలు బేఖాతర్​

By

Published : Nov 18, 2022, 12:08 PM IST

North Korea Ballistic Missile : ఉత్తర కొరియా మరోసారి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని చేపట్టింది. ఉత్తర తూర్పుతీరంలో బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగాన్ని గుర్తించినట్లు దక్షిణ కొరియా తెలిపింది. అది కిమ్‌ సర్కార్ రూపొందించిన దీర్ఘశ్రేణి క్షిపణేనని.. అణ్వాయుధాలను కూడా మోసుకెళ్తుందని పేర్కొంది.

north korea ballistic missile
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం

North Korea Ballistic Missile : అమెరికా హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోని ఉత్తర కొరియా మరోసారి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని చేపట్టింది. గురువారం స్పల్పశ్రేణి లక్ష్యాలను ఛేదించే క్షిపణిని పరీక్షించిన కిమ్ సర్కార్.. శుక్రవారం దీర్ఘశ్రేణి లక్ష్యాలను ఢీకొట్టే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. ఉత్తర తూర్పుతీరంలో బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగాన్ని గుర్తించినట్లు దక్షిణ కొరియా తెలిపింది. దీనిపై చర్చించేందుకు అత్యవసర భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తమ పశ్చిమతీర ప్రాంతం నుంచి ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇటీవల ఉత్తర కొరియా చేసిన క్షిపణి పరీక్షల్లో శుక్రవారం చేసింది సరికొత్త ప్రయోగమని.. గురువారం స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడానికి ముందు వారంపాటు ప్రయోగాలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇది కిమ్‌ సర్కార్ రూపొందించిన దీర్ఘశ్రేణి క్షిపణి అని.. అణ్వాయుధాలను కూడా మోసుకెళ్తుందని దక్షిణ కొరియా పేర్కొంది. ఈ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అమెరికాలోని ఏ లక్ష్యాన్నైనా ఛేదిస్తుందని తెలిపింది. ఈ ప్రయోగంతో ఇప్పటివరకు ఉత్తర కొరియా ఈ ఏడాది 8 ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులను పరీక్షించింది.

ABOUT THE AUTHOR

...view details