Monkey Calls 911: అమెరికా కాలిఫోర్నియాలోని పోలీసులకు జూ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కానీ ఎవరూ మాట్లాడకుండానే ఆ కాల్ డిస్కనెక్ట్ అయింది. కాల్ ముగిసిన వెంటనే ఏమైందో అనే కంగారులో పోలీసులంతా అక్కడికి బయల్దేరారు. ఆ ఫోన్‌కాల్‌ను ట్రేస్ చేయగా ఆ చుట్టుపక్కల ఎవరికీ ప్రమాదం లేదన్న సమాచారం తెలిసింది. తీరా చూస్తే కాల్ చేసింది మరెవరో కాదు అదే జూకు చెందిన రౌట్ అనే ఒక కొంటె కోతిపిల్ల. దీంతో పోలీసులు అవాక్కయ్యారు.
అసలేం జరిగిందంటే: జూ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం జూ లోని 40 ఎకరాల గోల్ఫ్ కోర్టులో ఉన్న కార్ట్‌లో ఓ ఫోన్ ఉంది. అది కోతి పిల్ల చేతికి దొరకడంతో అది ఈ అల్లరి పని చేసిందని తేలింది. దీంతో మొదట ఊపిరి పీల్చుకున్న పోలీసులు ఆ తర్వాత కాసేపు నవ్వుకున్నారు.
ఈ సంఘటనను నెటిజన్లతో షేర్ చేసుకున్నారు పోలీసులు. ఈ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన కోతి చేసిన పనికి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు.