ఘోర ప్రమాదం.. బస్సు బోల్తా పడి 27 మంది దుర్మరణం - చైనా రోడ్డు ప్రమాదం లేటెస్ట్ న్యూస్
హైవేపై బస్సు బోల్తా పడిన ఘటనలో 27 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. చైనాలోని సండూ కౌంటీలో ఆదివారం జరిగిందీ ప్రమాదం.
ఘోర ప్రమాదం
చైనాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు. గుయ్‌ఝౌ రాష్ట్ర రాజధాని గుయాంగ్ నగరంలోని సండూ కౌంటీలో ఆదివారం ఉదయం జరిగిందీ ఘటన. ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సు బోల్తా పడిన సమయంలో అందులో 47 మంది ఉన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Last Updated : Sep 18, 2022, 11:54 AM IST