Kim Yo Jong threatens S Korea: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్.. దక్షిణ కొరియాకు తీవ్ర హెచ్చరికలు చేశారు. అణ్వాయుధాల పేరుతో భయపెట్టే ప్రయత్నం చేశారు. దక్షిణ కొరియా సైనిక ఘర్షణకు దిగితే తమ దేశం నేరుగా అణ్వాయుధాలనే ఉపయోగిస్తుందని అన్నారు. 'ఉత్తర కొరియాపై రక్షణాత్మక దాడుల గురించి దక్షిణ కొరియా రక్షణ మంత్రి వ్యాఖ్యానించడం చాలా పెద్ద తప్పు. దక్షిణ కొరియా సైనిక సంఘర్షణ ప్రారంభిస్తే.. ప్రతిగా ఉత్తర కొరియా ఒక్క బుల్లెట్ కూడా కాల్చదు. షెల్లింగుల జోలికి వెళ్లదు. ఎందుకంటే మా సాయుధ దళాల సామర్థ్యానికి అవి సరితూగవు. మా అణ్వాయుధ దళాలే తమ పని చేసుకుపోతాయి' అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
'బుల్లెట్లు కాల్చం.. నేరుగా అణుబాంబులే'.. కిమ్ సోదరి హెచ్చరిక - అణ్వాయుధాలతో కిమ్ హెచ్చరిక
Kim Yo Jong threatens S Korea: దక్షిణ కొరియా తమపై దాడి చేయాలని ప్రయత్నిస్తే బుల్లెట్లు కాల్చబోమని, అణ్వాయుధాలతోనే దాడి చేస్తామని ఉత్తర కొరియా అధ్యక్షుడి సోదరి కిమ్ యో జోంగ్ అన్నారు. యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెబుతూనే దక్షిణ కొరియాకు తీవ్ర హెచ్చరికలు చేశారు.
Kim Yo Jong nuclear threats: దక్షిణ కొరియా సైన్యాన్ని పనికిరాని ఆర్మీగా అభివర్ణించారు కిమ్ సోదరి. తమపై దాడి చేస్తే తప్ప.. దక్షిణ కొరియా సైన్యాన్ని తమ లక్ష్యంగా పరిగణించమని అన్నారు. అయితే, ఇరుదేశాల్లో వినాశకర పరిస్థితులకు దారితీసే యుద్ధాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 1950 నాటి పరిస్థితులను తాము కోరుకోవడం లేదని అన్నారు. దక్షిణ కొరియా తదుపరి చర్యల ఆధారంగా పరిస్థితుల్లో మార్పు ఉంటుందని పేర్కొన్నారు. కొరియన్ సెంట్రల్ కమిటీ వర్కర్స్ పార్టీకి డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న కిమ్ యో జోంగ్.. తన అన్న కిమ్ జో ఉన్‌కు అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నారు. దక్షిణ కొరియా సహా అమెరికాకూ అప్పుడప్పుడు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు.
ఇదీ చదవండి:Ukraine Crisis: కిరాయి సైనికులతో డాన్‌బాస్‌పై రష్యా గురి!