తెలంగాణ

telangana

ETV Bharat / international

బాలికకు బైడెన్​ 'స్పెషల్​ డేటింగ్‌' సలహా.. వీడియో వైరల్​! - బైడెన్​ సలహా

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఓ బాలికకు రిలేషన్‌షిప్‌ సలహా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడం వల్ల నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.

joe bidens dating advice for this young girl
joe bidens dating advice for this young girl

By

Published : Oct 17, 2022, 7:09 AM IST

Biden Dating Suggestion: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఓ బాలికకు డేటింగ్‌ అడ్వైజ్‌ ఇచ్చిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. అయితే, అధ్యక్షుడి సలహాకు ఆ బాలిక ఒకింత ఇబ్బందిపడినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. కాలిఫోర్నియాలోని ఇర్విన్‌ వ్యాలీ కమ్యూనిటీ కాలేజీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి బైడెన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్యాంపస్‌లో విద్యార్థులతో సరదాగా ఫొటోలు దిగిన అధ్యక్షుడు.. తన ముందు నిల్చున్న బాలికతో మాట్లాడుతూ 30 ఏళ్లు వచ్చేవరకు సీరియస్‌ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లొద్దంటూ డేటింగ్‌ అడ్వైజ్‌ ఇచ్చారు. తన కుమార్తెలు, మనవరాళ్లకు ఇదే సలహా ఇచ్చానని ఆయన పేర్కొన్నారు.

అయితే అధ్యక్షుడి సలహాకి ఆ బాలిక ఒకింత అసౌకర్యానికి గురైనట్లు కనిపించింది. 'ఓకే, నేను దీన్ని దృష్టిలో ఉంచుకుంటాను' అంటూ సమాధానం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఆ వీడియోను ఇప్పటికే 5.2మిలియన్ల మంది వీక్షించారు. కాగా దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. అధ్యక్షుడి సలహాతో అసౌకర్యానికి గురైంది, ఆమెకు ఎలా స్పందించాలో తోచలేదు అంటూ కొందరు విమర్శించారు. అయితే, బాలిక ఇబ్బంది పడలేదని, అధ్యక్షుడు ఆప్యాయంగా భుజం మీద చేయివేస్తే ఆమె సంభ్రమాశ్చర్యాలకు లోలైందని బైడెన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details