తెలంగాణ

telangana

ETV Bharat / international

దుండగుడి కాల్పుల్లో భారతీయ విద్యార్థి మృతి.. జైశంకర్ దిగ్భ్రాంతి - indian student

Indian student shot dead in Canada: కెనడాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఓ భారతీయ విద్యార్థి మృతిచెందాడు. మరో ఘటనలో ఆయుధాల కోసం షాప్​ ఓనర్​ సహా అతడి భార్య, మనవడిని కాల్చి చంపారు ముష్కరులు.

indian students in canada
indian student shot dead in toronto

By

Published : Apr 9, 2022, 7:35 PM IST

Indian student shot dead in Canada: కెనడాలో ఘోరం జరిగింది. టొరంటోలో చదువుతున్న 21 ఏళ్ల భారతీయ విద్యార్థి.. ఓ దుండగుడి కాల్పుల్లో మృతిచెందాడు. సెయింట్ జేమ్స్​ టౌన్​లో సబ్​వే స్టేషన్​ వద్ద గురువారం సాయంత్రం కార్తిక్ వాసుదేవ్ అనే విద్యార్థిపై​ దుండగుడు కాల్పులు జరిపాడు. ఘటనాస్థలిలో ఉన్న వైద్య సిబ్బంది అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడే అతడు మృతిచెందాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వాసుదేవ్ మృతి పట్ల భారత కాన్సులేట్ జనరల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అతడి అవశేషాలను వీలైనంత త్వరగా భారత్​కు పంపించేందుకు సహకరిస్తామని తెలిపింది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా విద్యార్థి మృతి పట్ల సంతాపం తెలిపారు.

ముగ్గురిని చంపి ఆయుధాల అపహరణ:జార్జియాలోని ఓ గన్​ రేంజ్​ వద్ద దొంగతనానికి పాల్పడి, ముగ్గురి ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు దుండగులు. దాదాపు 40 ఆయుధాలతో పాటు వీడియో కెమెరా ఎత్తుకెళ్లిన కిరాతకులు.. షాప్​ ఓనర్​, అతడి భార్య సహా మనవడిని బలితీసుకున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇదీ చూడండి:ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. పోలీసులపై నిందితుడు కాల్పులు

ABOUT THE AUTHOR

...view details