Indian national arrested in US: సీనియర్ సిటిజన్లను మోసగించిన కేసులో అమెరికాలోని వర్జీనియాలో అరెస్టు చేసిన అనిరుద్ధ కాల్కోటే (24) అనే భారతీయ యువకుడిని హ్యూస్టన్ మేజిస్ట్రేట్ ఎదుట ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు హాజరుపరిచారు. కుట్ర, మెయిల్స్ మోసాలకు పాల్పడినట్లు ఇతడిపై అభియోగాలు నమోదయ్యాయి. హ్యూస్టన్‌లో అక్రమంగా నివసిస్తున్న ఎం.డి.ఆజాద్ (25) పైనా ఇవే అభియోగాలు మోపారు. ఆజాద్‌పై 2020 ఆగస్టులోనే కేసు నమోదైంది. వీరిద్దరూ బాధితులను పలుమార్లు మోసగించారని, సొమ్ము చెల్లించకుంటే భౌతికదాడి చేస్తామని బెదిరించారని అభియోగ పత్రంలో పేర్కొన్నారు. ఈ నేరారోపణలు రుజువైతే.. ఇద్దరికీ 20 ఏళ్ల జైలుశిక్షతోపాటు సుమారు రూ.1.95 కోట్ల (2.50 లక్షల డాలర్లు) జరిమానా విధిస్తారు.
అమెరికాలో భారతీయ యువకుడి అరెస్టు.. వారికి అలాంటి మెయిల్స్!
Indian national arrested in US: అమెరికాలో సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న ఓ భారతీయ యువకుడిని అరెస్టు చేశారు అక్కడి పోలీసులు. అక్రమ నివాసం అభియోగాలతో మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
Indian national arrest in US
అభియోగాల ప్రకారం.. నిందితులు పలురకాల మోసాలకు పాల్పడ్డారు. బాధితుల వ్యక్తిగత వివరాలు, బ్యాంకు, క్రెడిట్ కార్డు వివరాలను సైతం అపహరించారని న్యాయశాఖ తెలిపింది. ఇదే కేసులో సుమిత్‌కుమార్ సింగ్ (24), హిమాంశు కుమార్ (24), ఎం.డి.హసీబ్ (26) తమ నేరం అంగీకరించారు. ఈ ముగ్గురు భారతీయులూ హ్యూస్టన్‌లో అక్రమంగా నివాసముంటున్నారు. వీరికి శిక్షలు ఖరారు కావాల్సి ఉంది.
ఇదీ చూడండి:హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు దుర్మరణం