Israel Hezbollah War :ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. హమాస్‌కు మద్దతుగా లెబనాన్‌లోని మిలిటెంట్ సంస్థ 'హెజ్బొల్లా' కూడా యుద్ధంలోకి వచ్చి చేరింది. ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై ఆదివారం హెజ్బొల్లా గ్రూప్ డజన్ల కొద్దీ రాకెట్లు, మోర్టార్ షెల్స్‌ను ప్రయోగించింది. ఇజ్రాయెల్ ఆధీనంలోని గోలన్‌హైట్స్ వద్ద ఈ స్థావరాలు ఉన్నాయి.
హెజ్బొల్లా.. ఈ దాడులపై అధికారికంగా స్పందించింది. భారీ సంఖ్యలో రాకెట్లు, షెల్స్‌ను వినియోగించినట్లు వెల్లడించింది. పాలస్తీనా పోరాటానికి సంఘీభావంగా తాము దాడి చేసినట్లు ప్రకటించింది. షీబా ఫామ్స్, జిబ్‌డెన్ ఫామ్ వద్ద ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఇప్పటికే తాము ఇజ్రాయెల్‌పై చేసిన మెరుపుదాడికి ఇరాన్ నుంచి మద్దతు లభించిందని హమాస్ వెల్లడించింది. తాజాగా లెబనాన్‌లోని హెజ్బొల్లా కూడా ఈ యుద్ధంలోకి రావడం వల్ల పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది.
పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలు..
మరోవైపు ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులను అక్కడి దళాలు తిప్పికొట్టాయి. అయితే ఈ ఘటనలో ఎంతమంది మృతి చెందారో మాత్రం స్పష్టత లేదు. తమపైకి మోర్టార్ గుండ్లను ప్రయోగించిన ప్రదేశంపై ఎదురు దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. 1981లో గోలన్ హైట్స్‌ను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది.
డ్యాన్స్ పార్టీపై పడి విచక్షణారహితంగా కాల్పులు..
ఇజ్రాయెల్‌లో ఉత్సాహంగా జరుగుతున్న ఓ డ్యాన్స్ పార్టీపై హమాస్ మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. ప్రాణాలు కాపాడుకునేందుకు నిస్సహాయంగా పరుగులు తీస్తున్నవారిని పిట్టల్లా కాల్చిచంపారు. మృతుల్లో చాలా మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు.