WHO Director General: ప్రపంచ సమాజమంతా నల్లజాతీయులపై వివక్ష చూపుతోందని ఆరోపించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ టెడ్రోస్ అధనోమ్. ఉక్రెయిన్ యుద్ధానికి ఇచ్చిన ప్రాధాన్యం.. ఇథియోపియా, యెమెన్, అఫ్గానిస్థాన్, సిరియా వంటి ఇతర సంక్షోభాలకు ప్రపంచ దేశాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఆ దేశంలో బాధలు అనుభవిస్తున్నది శ్వేతజాతీయులు కాకపోవడమే ఇందుకు కారణమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం నలుపు, శ్వేత జాతీయులు ఇద్దరిపై సమానంగానే శ్రద్ధ వహిస్తుందా అని ప్రశ్నించారు. బుధవారం జెనీవాలో జరిగిన వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
'ఉక్రెయిన్నే కాదు నల్ల జాతీయుల దేశాలనూ పట్టించుకోండి' - who news
WHO Director General: ఉక్రెయిన్ యుద్ధానికి ఇచ్చిన ప్రాధాన్యం ఇతర సంక్షోభ దేశాలకు ఇవ్వడంలేదని అన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ టెడ్రోస్ అధనోమ్. ప్రపంచమంతా నల్లజాతీయులపై వివక్షను చూపుతోందన్నారు.
who news
గత నెలలో ఇథియోపియాలోని టిగ్రే ప్రాంతంలో భారీ సంక్షోభం సంభవించిందని.. లక్షల మంది ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లిందన్నారు. 2 వేల ట్రక్కుల ఆహారం, మందులు, నిత్యావసరాలు అవసరం ఉన్నా.. కేవలం 20 ట్రక్కులు మాత్రమే వచ్చాయని అధనోమ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ జరుగుతున్న దురాగతాలను ప్రదర్శించడంలో మీడియా విఫలమైందని ఆరోపించారు.
ఇదీ చదవండి:'ఉక్రెయిన్‌పై రష్యాది మారణకాండే'.. పుతిన్‌పై బైడెన్ గరం!