'ఐరన్‌మ్యాన్' టైటిల్ ఐదోసారీ డేనియాలాకే ఫ్రాన్స్‌లో జరిగిన ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్(ఈత, సైక్లింగ్, రన్నింగ్)లో మెరుగైన ప్రతిభ కనబరిచింది స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ అథ్లెట్ డేనియాలా రైఫ్. వరుసగా ఐదోసారి ఐరన్ మ్యాన్ ప్రపంచ మహిళా ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది.
ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజుల పాటు 6వ ఐరన్‌మ్యాన్ పోటీలు జరిగాయి. ఇందులో పలు దేశాల నుంచి ఔత్సాహికులు పోటీ పడ్డారు. డేనియాలా రైఫ్ విజయం సాధించింది. రెండో స్థానంలో బ్రిటన్ అథ్లెట్ హోలి లారెన్స్, మూడో స్థానంలో స్విట్జర్లాండ్‌కు చెందిన ఇమెజెన్ సైమండ్స్ నిలిచారు.
పోటీ ఏంటి..?
ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్లో మూడు విభాగాల్లో పోటీ ఉంటుంది. 1.93 కిలోమీటర్ల ఈత, 90.12 కిలోమీటర్ల సైక్లింగ్, 21 కిలోమీటర్ల పరుగు పందెం. ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి: అమెరికా-తాలిబన్ల శాంతి చర్చలకు ట్రంప్ బ్రేక్