China Construction In Aksai Chin India : సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్ సహా అక్సాయ్ చిన్ ప్రాంతం తమవేనంటూ ఇటీవల మ్యాప్‌ను విడుదల చేసిన చైనా.. వాస్తవాధీన రేఖకు ( Line Of Actual Control ) తూర్పు ప్రాంతం అక్సాయ్ చిన్‌లో సొరంగాలు తవ్వుతోంది. ఉత్తర లద్దాఖ్‌లోని దెప్సాంగ్‌కు తూర్పున ఆరు కిలోమీటర్ల దూరంలో సొరంగాలు, బంకర్లు, రహదారులను నిర్మిస్తున్నట్టు వెల్లడైంది. దీనికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు బయటికి వచ్చాయి.
అక్సాయ్ చిన్ ప్రాంతంలోని కొండల్లో కనీసం 11 చోట్ల పెద్ద కన్నాలు తవ్వుతున్నట్లు అంతర్జాతీయ నిపుణులు తేల్చారు. ఈ ప్రాంతంలో కొన్ని నెలలుగా పెద్దఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్నట్లు ఆ చిత్రాల ద్వారా గుర్తించారు. వైమానిక, క్షిపణి దాడులు జరిగినా తమ సైన్యానికి ఎటువంటి నష్టం కలగని విధంగా పటిష్ఠమైన కాంక్రీటు నిర్మాణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ భారత్ వైమానిక దాడులకు దిగితే దీటుగా ఎదుర్కొనేందుకే చైనా అక్కడ ఈ వ్యూహాలు రచిస్తున్నట్టు చెబుతున్నారు.ఈ ప్రాంతం వాస్తవాధీన రేఖకు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉండటం భారత్‌కు కొంత ఆందోళన కలిగించే అంశమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
China Names Indian Territories :అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ ప్రాంతాలను తమ దేశంలో భాగంగా చూపుతూ సోమవారం 'స్టాండర్డ్ మ్యాప్' (China Standard Map 2023)పేరిట చైనా ఓ మ్యాప్ విడుదల చేసింది. అందులో అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా డ్రాగన్ పేర్కొంది. అయితే, చైనా ఇలా కవ్వింపు చర్యలకు పాల్పడటం ఇదేం మొదటి సారి కాదు. ఇంతకుముందు ఏప్రిల్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని నదులు, పర్వతాలు, ప్రాంతాలకు చైనా తమ పేర్లు పెట్టింది. అంతకుముందు కూడా ఇలా పలు మార్లు భారత భూభాగాలకు పేర్లు పెట్టింది.