Child Dies Drinking Whiskey: ఓ నాలుగేళ్ల చిన్నారికి ఆమె నాయనమ్మ బలవంతంగా విస్కీ తాగించింది. ఆ సమయంలో ఆమె తల్లి అక్కడే ఉన్నా చూస్తూ ఊరుకోవడం వల్ల ఆ చిన్నారి మృతిచెందింది. ఈ దుర్ఘటన అమెరికాలోని లూసియానా రాష్ట్రం బాటన్ రౌగ్ ప్రాంతంలో జరిగింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు రోక్సాన్నే రికార్డ్ (53), కాద్జా రికార్డ్‌గా (29) గుర్తించారు పోలీసులు.
నాలుగేళ్ల చిన్నారికి విస్కీ.. అమ్మ, నాయనమ్మ జైలుకు! - అమెరికా లూసియానా వార్తలు
Child Dies Drinking Whiskey: ఆ చిన్నారి ఆలనాపాలనా చూసుకోవాల్సిన ఇంటివాళ్లే ఆమెకు మృత్యువుగా మారారు. కన్నతల్లి ఎదుటే నాయనమ్మ బలవంతంగా ఆమెకు విస్కీ తాగించింది. కళ్ల ముందు ఈ దారుణం జరుగుతున్నా తల్లి చూస్తూ ఊరుకుంది. చివరకు ఆ నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
విస్కీ తాగి చిన్నారి మృతి
చిన్నారి చైనా రికార్డ్ (4) శరీరంలో బ్లడ్ అల్కాహాల్ లెవెల్ 0.680 శాతం ఉన్నట్లు పోస్ట్‌మార్టంలో వెల్లడైందని అధికారులు తెలిపారు. పెద్దల్లో ఇది అత్యధికంగా 0.08 శాతం ఉంటుందని.. దీంతో పోలిస్తే చిన్నారి శరీరంలో ఎనిమిది రెట్లు ఎక్కువ ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి :శత్రు దేశాల అధినేతల 'ప్రేమ లేఖలు'- అసలు లక్ష్యం అదేనా?