Brics Summit 2023 Modi Speech :బ్రిక్స్‌ను.. భవిష్యత్తు సన్నద్ధత సంస్థగా మార్చేందుకు సభ్యదేశాల ప్రజలను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ క్రతువులో సాంకేతికత కీలక భూమిక పోషిస్తుందన్నారు. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న 15వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. సాంకేతికత ఉపయోగించి ప్రజాసేవాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు చెప్పారు. భిన్నత్వమే భారత్‌కు అతిపెద్ద బలమని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
"బ్రిక్స్‌ను ఒక భవిష్యత్తు సన్నద్ధత సంస్థగా తయారుచేసేందుకు మనదేశ ప్రజలను కూడా భవిష్యత్తు కోసం సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇందులో సాంకేతికత కీలకపాత్ర పోషిస్తుంది. భారత్‌లో మేం మారుమూల ప్రాంతాల బాలబాలికలకు విద్యను చేరువ చేసేందుకు దీక్షా ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేశాం. పాఠశాల విద్యార్థుల్లో ఆవిష్కరణల సామర్థ్యం పెంచటానికి దేశవ్యాప్తంగా అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశాం. భాషా సంబంధిత సమస్యల పరిష్కారానికి భారత్‌లో కృత్రిమమేథ ఆధారిత భాషావేదిక భాషిణీని ఉపయోగిస్తున్నాం. వ్యాక్సినేషన్ కోసం కోవిన్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేశాం. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మాధ్యమం ద్వారా ప్రజాసేవల్లో విప్లవాత్మక మార్పు తెచ్చాం. భిన్నత్వం భారత్ అతిపెద్ద బం. భారత్‌లో ఏ సమస్యకైనా ఈ భిన్నత్వం ద్వారానే పరిష్కారం లభిస్తుంది."
--నరేంద్రమోదీ, ప్రధానమంత్రి