Boat Capsized Bangladesh : బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పడవ బోల్తా పడడం వల్ల 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. ఉత్తర బంగ్లాదేశ్‌లోని పంచాగఢ్ జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
పడవ బోల్తా.. 23 మంది దుర్మరణం.. అనేక మంది గల్లంతు - బంగ్లాదేశ్ పడవ బోల్తా
Boat Capsized Bangladesh : పడవ బోల్తా పడిన ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో ప్రయాణికులు గల్లంతయ్యారు. ఈ ప్రమాదం బంగ్లాదేశ్‌లో జరిగింది.
boat accident in bangladesh
సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల బంగ్లాదేశ్‌లో తరచూ పడవ ప్రమాదాలు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్‌లో గంగా, బ్రహ్మపుత్రతో కలిపి గతేడాది డిసెంబర్లో జరిగిన ప్రమాదంలో సుమారు 37 మంది మరణించారు. అంతకుముందు నవంబర్‌లో జరిగిన పడవ ప్రమాదంలో 85 మంది మృతి చెందారు.
Last Updated : Sep 25, 2022, 5:40 PM IST