Afghanistan bomb blast: అఫ్గానిస్థాన్‌లో బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. ఉత్తర అఫ్గానిస్థాన్‌లో గురువారం జరిగిన రెండు బాంబు దాడుల్లో 9 మంది మరణించారని తాలిబన్ అధికారి తెలిపారు. ఈ ఘటనలో మరో 13 మందికి గాయాలయ్యాయని వెల్లడించారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ రెండు పేలుళ్లు జరిగాయని అన్నారు.
అఫ్గాన్‌లో బాంబు పేలుళ్లు.. 9 మంది మృతి - అఫ్గాన్‌లో బాంబు పేలుళ్లు 9 మంది మృతి
Afghanistan bomb blast: అఫ్గానిస్థాన్‌లో భారీ బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది గాయపడ్డారు.
బాల్ఖ్ ప్రావిన్స్ రాజధాని మజార్-ఇ-షరీఫ్‌లో రెండు మినీ బస్సులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు పేలుళ్లు జరిపారని అధికారులు తెలిపారు. పేలుళ్లకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదని అన్నారు. ఈ బాంబు దాడులకు పాల్పడింది ఎవరో ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. తాలిబన్ బలగాలు ఘటనా స్థలాన్ని చుట్టుముట్టాయి. గత వారమే మసీదు, మతపరమైన పాఠశాలలో జరిగిన బాంబు దాడిలో 33 మంది మరణించారు. మరో 43 మందికి గాయాలయ్యాయి. షియాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు ముష్కరులు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:Plane Crash: 66 మంది ప్రాణాలు తీసిన సిగరెట్