8 People Trapped in Cable Car Pakistan :భూమికి 900 అడుగుల ఎత్తులో ఓ కేబుల్ కార్‌లో ఆరుగురు పిల్లలు సహా ఇద్దరు వ్యక్తులు చిక్కుకున్న ఘటన పాకిస్థాన్‌లో జరిగింది. ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ బట్టగ్రామ్ జిల్లాలో ఈ ప్రమాదకర ఘటన జరిగింది. 10 నుంచి పదిహేనేళ్ల వయసున్న పిల్లలు పాఠశాలకు కేబుల్ కార్‌లో వెళుతుండగా అందులోని ఓ కేబుల్ తెగిపోయింది. దీంతో భూమికి.. ఆకాశానికి మధ్య భయంకరమైన స్థితిలో కేబుల్ కారు వేలాడుతోంది.
Pakisthan Cable Car Incident Today : సమాచారం అందుకున్న అధికారులు 2 ఆర్మీ హెలికాఫ్టర్లను రప్పించి.. కేబుల్ కార్‌లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. తీవ్రమైన గాలులు వీస్తుండటం, రాత్రి సమయం కావడంతో చిక్కుకున్న వారిని కాపాడాటం అత్యంత ప్రమాదకరంగా మారినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆర్మీ అధికారులు హెలికాఫ్టర్ సాయంతో ఇద్దరు చిన్నారులను రక్షించారని అధికారులు పేర్కొన్నారు. మిగతా వారికి కూడా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు వారు వెల్లడించారు. కొండ ప్రాంతం కావడం వల్ల ఒక వైపు నుంచి మరో వైపు వెళ్లేందుకు ప్రజలు తరచుగా కేబుల్ కార్లను ఉపయోగిస్తారని అధికారులు పేర్కొన్నారు.