తెలంగాణ

telangana

ETV Bharat / international

గాజా యుద్ధానికి 100 రోజులు- అట్టుడుకుతున్న పశ్చిమాసియా!- అందోళనలో ప్రపంచ దేశాలు! - గాజా ఇజ్రాయెల్ యుద్ధం

100 Days For Gaza Israel War : గాజా-ఇజ్రాయెల్‌ మధ్య సాగుతున్న పోరు ప్రారంభమై వంద రోజులైంది. ఈ వంద రోజుల్లో ఎందరో అమాయకులు ఈ దాడుల్లో బలయ్యారు. కీలక హమాస్‌ నేతలను ఇజ్రాయెల్‌ మట్టుబెట్టింది. గాజాలో హమాస్‌ మూలాలను పూర్తిగా నాశనం చేసే వరకూ యుద్ధాన్ని ఆపేదే లేదని ఇప్పటికే ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం కనిపిస్తుండడం వల్ల ప్రపంచం ఆందోళన చెందుతోంది.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2024, 10:23 PM IST

100 Days For Gaza Israel War :ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమై వంద రోజులైంది. 1948లో ఇజ్రాయెల్ స్థాపన తర్వాత ఇజ్రాయెల్-పాలస్తీనియన్ల మధ్య జరిగిన సుదీర్ఘ యుద్ధం ఇదేనని నిపుణులు చెబుతున్నారు. యుద్ధం ప్రారంభమై వంద రోజులు గడుస్తున్నా ఈ పరస్పర దాడులు ఆగే సంకేతాలు ఏం కనిపించడం లేదు.

గాజా ఇజ్రాయెల్ యుద్ధం

'హమాస్​ను మట్టుబెట్టే దాకా వదలం!'
గత ఏడాది అక్టోబరు 7న సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లోకి చొరబడ్డ హమాస్‌ మిలిటెంట్లు వందల మందిని చంపి 250 మంది బందీలుగా గాజాకు తీసుకెళ్లారు. ఈ దాడితో రగిలిపోయిన ఇజ్రాయెల్‌ గాజాలో హమాస్‌ మిలిటెంట్లను మట్టుబెడతామని ప్రతినబూని భీకర దాడులకు దిగింది. అప్పటినుంచి గగన తల, భూతల దాడులతో గాజాపై విరుచుకుపడింది. ఈ దాడిలో గాజా కనీవినీ ఎరుగనంత నష్టపోయింది. అయినా హమాస్‌ బందీలను విడుదల చేయలేదు. మరోవైపు ఈ యుద్ధం 2024లో కూడా నిరాంటకంగా కొనసాగుతుందని ఇజ్రాయెలీ మిలిటరీ చెబుతోంది.

గాజా ఇజ్రాయెల్ యుద్ధం

ఇజ్రాయెల్‌ భీకర దాడులతో గాజాలో మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ యుద్ధం ఇజ్రాయెల్‌-గాజాలను సంవత్సరాల తరబడి వెంటాడుతుందని రాబోయే తరాలపై కూడా ఈ యుద్ధం ప్రభావం ఉంటుందని ఆర్మీ నిపుణులు చెబుతున్నారు. అక్టోబరు 7న హమాస్‌ దేశంలోకి చొరబడినప్పటి వైఫల్యాలు ఇప్పటివరకూ బందీలను స్వదేశానికి తీసుకు రాకపోవడం వంటి ప్రతికూలతలు ప్రధాని నెతన్యాహుకు తలనొప్పిగా మారే అవకాశం ఉంది.

2023 అక్టోబర్​లో ఖాన్​ యూనిస్​పై ఇజ్రాయెల్ దాడిలో ధ్వంసమైన భవనాలు

23 వేలకు పైగా మరణాలు
ఇప్పటికే గాజాలో మరణాల సంఖ్య 23 వేలు దాటిందని హమాస్‌ నేతృత్వంలో నడిచే గాజా ఆరోగ్య అధికారులు తెలిపారు. వేలాదిమంది పాలస్తీనీయన్లు అదృశ్యమయ్యారని వివరించారు. గాజా జనాభాలో నాలుగింట ఒక వంతు మంది ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. గాజాలోని 36 ఆసుపత్రుల్లో కేవలం 15 మాత్రమే పాక్షికంగా పనిచేస్తున్నాయని అక్కడి వైద్య వ్యవస్థ పతనానికి దగ్గరగా ఉందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. పిల్లలు నెలల తరబడి పాఠశాలకు దూరమయ్యారని తెలిపింది

ఇజ్రాయెల్‌-గాజా మధ్య జరుగుతున్న యుద్ధం మరింత తీవ్రరూపం దాలిస్తే పరిస్థితులు మరింత దుర్లభంగా మారుతాయని ప్రపంచ దేశాలు భయపడిపోతున్నాయి. ఇరాన్ మద్దతుగల మిలిటెంట్ గ్రూపులకు వ్యతిరేకంగా అమెరికా నేతృత్వంలోని కూటమి రణ నినాదం చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అని ఆందోళన పడుతున్నాయి. ఇప్పటికే లెబనాన్‌లోని ఇరాన్ మద్దతుగల హిజ్బుల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేస్తున్నారు.

గాజా ఇజ్రాయెల్ యుద్ధం

హౌతీల సాగర యుద్ధం!
యెమెన్‌లోని ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేశారు. ఇరాన్ మద్దతుగల మిలీషియా ఇరాక్ సిరియాలోని అమెరికా దళాలపై దాడి చేసింది. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇజ్రాయెల్‌పై మారణ హోమం కేసు నడుస్తోంది. ఇలా ఇజ్రాయెల్‌-గాజా యుద్ధం అనేక రూపాలు సంతరించుకుంటోంది.

పాలస్తీనా ప్రజలు గత వంద రోజులుగా బాధాకరమైన క్షణాలు గడిపారని పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ప్రతినిధి నబిల్ అబు రుదీనె వ్యాఖ్యానించారు. పోరాటం ఎప్పుడు ముగుస్తుందన్న దానిపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. గాజాలో హమాస్‌ పాలన కూలి పాలస్తీనా అథారిటీ పాలన రావాలని అమెరికా సహా అంతర్జాతీయ సమాజం కోరుకుంటోంది.

ABOUT THE AUTHOR

...view details