స్టేడియం అంతా కోలాహలంగా ఉంది. మధ్యలో ఉన్న కుస్తీ రింగులో గెలుపు కోసం ఇద్దరు మల్లయోధులు శ్రమిస్తున్నారు. ఒకరిపై ఒకరు ఆధిక్యం చూపేందుకు, ఆటలో విజయం సాధించేందుకు అలుపెరుగక పోరాడుతున్నారు. అంతలోనే ఒకరి పట్టు సడలిపోతూవచ్చింది. అప్పటివరకు అందరినీ ఉత్సాహపరుస్తూ ప్రత్యర్థిని ఓడించే ప్రయత్నంలో ఉన్న యోధుడు... తానెంతో ప్రేమించే కుస్తీ రింగులోనే ప్రాణాలు వదిలాడు.
కుస్తీ పడుతూనే తుదిశ్వాస విడిచిన రెజ్లర్ - death
లండన్‌లోని రౌండ్ హౌస్ స్టేడియంలో కుస్తీ పోటీలో పాల్గొంటున్న ఓ రెజ్లర్ రింగులోనే ప్రాణాలు కోల్పోయాడు. గుండెపోటే ఇందుకు కారణం.
సిల్వర్ కింగ్... ఈ పేరుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు. తాను పోరాడే చివరి మ్యాచ్ ఇదేనని తెలియని అతగాడు... ప్రత్యర్థి యూత్ వారియర్‌తో జరిగే కుస్తీ పోటీ కోసం వచ్చాడు. ఎప్పట్లాగే తనదైన శైలిలో అందరినీ పలకరించాడు. లండన్‌లోని రౌండ్‌హౌస్ స్టేడియం సాక్షిగా తనతో పోరాడబోయే క్రీడాకారుడితో చేయి కలిపాడు. తనదైన ఆటతో ప్రత్యర్థిని ఓడించేందుకు ప్రయత్నించాడు. కానీ విధి వక్రించింది. ఎందరినో మట్టికరిపించిన 51 ఏళ్ల సిల్వర్ కింగ్ కుస్తీ రింగులోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచాడు. సిల్వర్ కింగ్‌ది సాధారణ మరణమేనని పోలీసులు ధ్రువీకరించారు.
ఇదీ చూడండి: ముంబయి టైటిళ్ల వెనుక సెంటిమెంట్లు, ప్రత్యేకతలు