తెలంగాణ

telangana

By

Published : Jul 8, 2020, 8:39 AM IST

ETV Bharat / international

బ్రెజిల్​లో కరోనా​ ప్రళయం.. ఒక్కరోజులో 45వేల కేసులు

ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటివరకు 1,19,48,244మంది వైరస్​ బారినపడ్డారు. మృతుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. 5,46,547మంది మరణించారు. బ్రెజిల్​లో వైరస్​ విలయతాండవం సృష్టిస్తోంది. ఒక్కరోజులోనే 45వేలకుపైగా కొత్త కేసులు బయటపడ్డాయి.

worldwide-situation-of-corona-virus-pandemic
బ్రెజిల్​లో కరోనా​ ప్రళయం.. ఒక్కరోజులో 45వేల కేసులు

ప్రపంచంపై కరోనా వైరస్​ పంజా విసురుతోంది. రోజురోజుకు కొత్త కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 1,19,48,244 కేసులు నమోదయ్యాయి. 5,46,547మంది కరోనాకు బలయ్యారు. అమెరికా, బ్రెజిల్​ సహా ప్రపంచ దేశాలు వైరస్​ ధాటికి గడగడలాడుతున్నాయి.

దేశం కేసులు మరణాలు
అమెరికా 30,97,084 1,33,972
బ్రెజిల్​ 16,74,665 66,868
రష్యా 6,94,230 10,495
పెరూ 3,09,278 10,952
చిలీ 3,01,019 6,434
స్పెయిన్​ 2,99,210 28,392
బ్రిటన్​ 2,86,349 44,391
మెక్సికో 2,68,009 32,014
ఇరాన్​ 2,45,688 11,931

45వేల కేసులు...

బ్రెజిల్​లో కరోనా వైరస్​ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఒక్కరోజు వ్యవధిలో 45,305కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు వైరస్​ కేసుల సంఖ్య 16,74,665 కేసులు నమోదయ్యాయి. 1,254 తాజా మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 66,868కి పెరిగింది.

అయితే బ్రెజిల్​లో ఇప్పటివరకు 9,76,977మంది వైరస్​ను జయించారు.

ఇదీ చూడండి:-ఆ దేశాధ్యక్షుడికి కరోనా పాజిటివ్​

ఆ విమానాలపై నిషేధం..

కరోనా సృష్టించిన విలయతాండవాన్ని స్పెయిన్ ​వాసులు ఇప్పట్లో మర్చిపోలేరు. అయితే స్పెయిన్​ రాజధాని రోమ్​కు సమీపంలో నివసిస్తున్న బంగ్లాదేశీయుల సంఘంలో కొత్త క్లస్టర్​ ఏర్పడింది. ఇటీవలే బంగ్లాదేశ్​ నుంచి తిరిగొచ్చిన ఓ ఉద్యోగితో ఇది మొదలైందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. బంగ్లాదేశ్​కు చెందిన విమాన సేవలను నిషేధించింది. ఈ నిషేధం ఒక వారం పాటు ఉండనుంది.

ఇదీ చూడండి:-డబ్ల్యూహెచ్​ఓ నుంచి అమెరికా వైదొలిగేది అప్పుడే..!

ABOUT THE AUTHOR

...view details