బ్రెజిల్లో 28లక్షలు దాటిన కరోనా కేసులు - WORLD CORONA
ప్రపంచంపై కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు కొత్త కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజుకు రెండు లక్షలకుపైగా కేసులు నమోదవుతుండటం వల్ల మొత్తం బాధితుల సంఖ్య కోటీ 87 లక్షలు, మరణాలు 7 లక్షలు దాటాయి. కోటీ 19 లక్షల మందికిపైగా వైరస్ నుంచి కోలుకున్నారు.
ప్రపంచంపై కరోనా పంజా.. 7 లక్షలు దాటిన మరణాలు
By
Published : Aug 5, 2020, 7:18 PM IST
కరోనా మహమ్మారి వ్యాప్తి ఉద్ధృతంగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కేసులు, మరణాల్లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రోజుకు రెండు లక్షలకుపైగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా, బ్రెజిల్, భారత్ వంటి దేశాల్లో వైరస్ ప్రభావం అధికంగా ఉంది.
మొత్తం కేసులు: 1,87,36,353
మరణాలు: 7,05,067
కోలుకున్నవారు: 1,19,47,970
యాక్టివ్ కేసులు: 60,83,316
అమెరికాలో..
కరోనా కేసులు, మరణాల్లో అగ్రరాజ్యం దూసుకెళ్తోంది. మొత్తం కేసుల సంఖ్య 50 లక్షలకు చేరువైంది. లక్షా 60వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 24.82 లక్షల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
బ్రెజిల్లో..
బ్రెజిల్లో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. 28 లక్షల మంది వైరస్ బారినపడ్డారు. 96 వేల మందికిపైగా మృతి చెందారు. 19 లక్షల మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
పాక్లో 6వేల మరణాలు..
పాకిస్థాన్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 6,014కు చేరింది. దేశవ్యాప్తంగా కొత్తగా 675 మంది వైరస్ బారినపడగా.. మొత్తం కేసులు 2.81 లక్షలు దాటాయి.
సింగపూర్లో..
సింగపూర్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. బుధవారం రికార్డు స్థాయిలో 908 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలో ఇదే అత్యధికం. మొత్తం కేసుల సంఖ్య 54, 254కు చేరింది.
దక్షిణాఫ్రికాలో తగ్గుముఖం..
దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసుల నమోదు రేటులో తగ్గుదల కనిపించినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 5,21,318 మంది వైరస్ బారినపడ్డారు.