భూమి మీద నివసించే జీవుల్లో మానవులకు అత్యంత ప్రమాదకారి ఏది? అని ఎవరినైనా అడిగేతే.. ఒకరు సింహం.. మరొకరు పులి.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా సమాధానం చెబుతారు. ఆ సమాధానాలు నిజమే అయినా.. ఈ జగత్తులో వాటి కంటే ప్రమాదకరమైనవి ఉన్నాయని ఓ అధ్యయనం చెబుతోంది.
అవి ఏడాదికి వేల నుంచి లక్షల మందిని బలితీసుకుంటున్నాయని ఆ అధ్యయనం చెబుతోంది. ఇంతకీ ఏఏ జీవులు మానవుల పాలిట యమపాశంలా మారాయి. అవి ఏడాదికి ఎంత మందిని చంపుతున్నాయి. హ్యూమన్ కిల్లర్స్‌గా చెప్పుకునే టాప్-10 జీవుల వివరాలు మీకోసం..
దోమ..
ప్రపంచంలో ఏడాదికి అత్యధిక మందిని బలి తీసుకుంటూ.. దోమ మొదటి స్థానంలో నిలిచింది. దోమ కాటు ద్వారా వచ్చే మలేరియాతో సంవత్సరానికి ఏకంగా 7,25,000 మంది చనిపోతున్నారు.
మనవుడు..
రెండో ప్రమాదకారి మానవుడు. మనిషి క్రూరత్వానికి ఏటా లక్షల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. హత్యలు, హత్యాచారాలు.. ఇలా పలు కారణాలతో ఏడాదికి సగటున నాలుగు లక్షల మంది మానవ మృగానికి బలవుతున్నారు.
పాము..
పాముకాటు బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. ఏడాదికి పాము కాటుకు గురై సగటున 1,38,000 మంది ప్రాణాలు విడుస్తున్నారు.
శునకం..
శునకం కాటును తేలికగా తీసుకోవద్దు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే అది రేబిస్‌గా మారే ప్రమాదం ఉంది. రేబిస్ ద్వారా ఏడాదికి 59వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
అస్సాస్సిన్ బగ్..
ఇది హెమిప్టెరా జాతికి చెందిన కీటకం. ఇది చాలా ప్రమాదకరమైనవి. ఇది కుట్టడం వల్ల ఏటా 10వేల మంది చనిపోతున్నారు.