ప్రపంచ రెండో అత్యంత వృద్ధురాలిగా భావిస్తోన్న 116 ఏళ్ల సన్యాసిని సిస్టర్ ఆండ్రే కరోనాను జయించారు. దక్షిణ ఫ్రెంచ్ నగరమైన టౌలాన్లోని ఓ సంరక్షణ కేంద్రంలో ఉంటున్న ఆమెకు.. జనవరిలో కరోనా సోకింది. మూడు వారాల చికిత్స అనంతరం.. ఆమెకు కొవిడ్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది.
110 లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారి వివరాలను సేకరించే 'జెరొంటాలజీ రీసెర్చ్ గ్రూప్' ప్రకారం.. లుసైల్ రాండన్-సిస్టర్ ఆండ్రే.. అధిక వయస్కుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఈమె 1904 ఫిబ్రవరి 11న జన్మించినట్టు ఈ రీసెర్చ్ గ్రూప్ ధ్రువీకరించింది. ఈ నెల 11న(గురువారం) ఆండ్రే 117వ పడిలోకి అడుగుపెట్టనున్నారు.
కరోనా సోకినా...