తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్ 'టీకా' అనుమతిపై డబ్ల్యూహెచ్​ఓ హర్షం​ - ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా వార్తలు

కరోనా టీకాలకు భారత్​ అత్యవసర అనుమతివ్వడాన్ని డబ్ల్యూహెచ్ఓ స్వాగతించింది. ఈమేరకు ఆ సంస్థ దక్షిణ,తూర్పూ ఆసియా విభాగం ప్రాంతీయ డైరెక్టర్​ తెలిపారు. ​

World Health Organization welcomes India's decision giving emergency use authorization to #COVID19 vaccines
భారత్​ నిర్ణయాన్ని స్వాగతించిన డబ్ల్యూహెచ్​వో

By

Published : Jan 3, 2021, 12:38 PM IST

Updated : Jan 3, 2021, 3:00 PM IST

కొవాగ్జిన్, కొవిషీల్డ్‌ టీకాలకు భారత్​ అత్యవసర అనుమతివ్వడాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) స్వాగతించింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్​ఓ తూర్పు, దక్షిణాసియా విభాగం ప్రాంతీయ డైరెక్టర్​ డాక్టర్​ పూనమ్​ క్షేత్రపాల్​ సింగ్​ ప్రకటించారు.

కొవాగ్జిన్​, కొవిషీల్డ్​ టీకాల వినియోగానికి షరతులతో కూడిన అనుమతులు ఇస్తున్నట్లు ఈరోజు వెల్లడించారు డీసీజీఐ డైరెక్టర్​ జనరల్​ సోమని. టీకా భద్రత, సమర్థతపై సీరం సంస్థ వివరాలు సమర్పించినట్లు తెలిపారు. అలాగే.. భారత్​ బయోటెక్​ కొవాగ్జిన్​ భద్రమైనదని ఇప్పటికే నిర్ధరణ అయినట్లు చెప్పారు. తొలి 2 దశల పరీక్షల్లో 800 మందిపై కొవాగ్జిన్​ ట్రయల్స్​ విజయవంతమయ్యాయని, మూడో దశలో 25,800 మంది వలంటీర్లకు కొవాగ్జిన్​ టీకా ఇచ్చినట్లు తెలిపారు.

ఇదీ చూడండి:కొవిడ్​ రహిత ఆరోగ్య భారత్​కు బాటలు: మోదీ

Last Updated : Jan 3, 2021, 3:00 PM IST

ABOUT THE AUTHOR

...view details