వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 21 శాతం పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. వీటిలో అత్యధికంగా 69,000 మరణాలు అమెరికా, ఆగ్నేయాసియా దేశాల్లోనే నమోదైనట్లు పేర్కొంది.
అలాగే కరోనా కేసుల సంఖ్య సైతం 8 శాతం పెరిగినట్లు వెల్లడించింది డబ్ల్యూహెచ్ఓ. ఫలితంగా మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 19 కోట్ల 40 లక్షలకు చేరినట్లు పేర్కొంది.
"పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. రానున్న వారంలోనే మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 20 కోట్లు దాటుతుంది. ఐరోపాలో తప్ప అన్ని ప్రాంతాల్లో కరోనా మరణాలు పెరిగాయి. అలాగే అమెరికా, బ్రెజిల్, ఇండోనేషియా, బ్రిటన్, భారత్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి."