WHO approves Novavax vaccine : కరోనా వైరస్‌ను అరికట్టేందుకు మరో టీకా వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ పచ్చజెండా ఊపింది. నొవావాక్స్ టీకాకు అత్యవసర అనుమతి మంజూరు చేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) శుక్రవారం ప్రకటించింది. అమెరికా సంస్థ నొవావాక్స్ తయారు చేసిన ఈ టీకాను భారత్‌లో కొవొవాక్స్ పేరుతో సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. ఈ టీకా ఇప్పుడు గ్లోబల్ వ్యాక్సిన్- షేరింగ్ సిస్టమ్ కొవాక్స్‌లో భాగంగా పంపిణీ కానుంది.
'కరోనా కొత్త వేరియంట్‌లు వెలువడుతుండటంతో తీవ్రమైన అనారోగ్యం, మరణాల నుంచి ప్రజలను రక్షించేందుకు టీకాలు అత్యంత ప్రభావవంతమైన సాధనాల్లో ఒకటి. తక్కువ ఆదాయం గల దేశాల్లో మరింత మందికి టీకాలు ఇచ్చేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది' అని డబ్ల్యూహెచ్‌లో ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. తక్కువ ఆదాయం గల 41 దేశాల్లో ఇప్పటికీ 10 మంది కూడా టీకాలు పొందలేకపోయారని, 98 దేశాలు 40 శాతం కూడా తీసుకోలేదని డబ్ల్యూహెచ్‌లో సీనియర్ అధికారిణి మరియాంజెలో సిమావ్ తెలిపారు. ఈ అనుమతితో ఆయా దేశాల్లో మరింత మంది టీకాలు పొందే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.
Novavax vaccine news