US Russia Talks On Ukraine: రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న క్రమంలో అమెరికాతో చర్చలు జరిపేందుకు సిద్ధమైంది రష్యా. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో ప్రతిపాదించిన తేదీలకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అంగీకరించారు. అయితే ఉక్రెయిన్పై రష్యా దాడి చేయొద్దన్న షరతుతోనే అగ్రరాజ్యం ఈ చర్చలకు ఓకే చెప్పినట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి.
"ఉక్రెయిన్- రష్యా మధ్య ఏర్పడిన యుద్ధవాతావరణం నేపథ్యంలో రష్యా స్పందించింది. వచ్చే వారం అమెరికాతో చర్చలు జరిపేందుకు తేదీలను ప్రతిపాదించింది. వాటిని మేము అనుమతిస్తున్నాం. కానీ ఇకపై ఉక్రెయిన్పై రష్యా దాడికి పాల్పడొద్దని షరతు విధించాం."
-- అమెరికా విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రైస్
ఒకవేళ రష్యా మాట తప్పి రానున్న రోజుల్లో ఉక్రెయిన్పై దాడికి పాల్పడితే దౌత్య విధానాలను సీరియస్గా తీసుకోనట్లుగా భావిస్తామని నెడ్ ప్రైస్ అభిప్రాయపడ్డారు. తమ భాగస్వామ్య దేశాలు, నాటో దేశాలతోనూ రష్యాతో సంప్రదింపులు జరిపిస్తామన్నారు.
చర్చలను స్వాగతించిన యూఎన్ కౌన్సిల్..
అమెరికా- రష్యాల మధ్య చర్చలను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి స్వాగతించింది. ఉక్రెయిన్పై రష్యా దాడి చేయొద్దని సూచించాయి.