తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత హైకమిషన్ ఎదుట పాక్ మద్దతుదార్ల​ నిరసన - protest

అధికరణ 370 రద్దు నేపథ్యంలో బ్రిటన్​లోని భారత హైకమిషన్​ ఎదుట పాకిస్థాన్​ మద్దతుదారులు మంగళవారం ఆందోళన చేపట్టారు. కార్యాలయం పరిసరాల్లోని సామగ్రిని ధ్వంసం చేశారు.

భారత హైకమిషన్ ఎదుట పాక్ మద్దతుదార్ల​ నిరసన

By

Published : Sep 4, 2019, 10:55 AM IST

Updated : Sep 29, 2019, 9:41 AM IST

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దుపై పాకిస్థాన్​ తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది. తాజాగా బ్రిటన్​ రాజధాని లండన్​లోని భారత హైకమిషన్​ ఎదుట పాకిస్థాన్​ మద్దతుదారులు మంగళవారం ఆందోళనకు దిగారు.

భారత హైకమిషన్ ఎదుట పాక్ మద్దతుదార్ల​ నిరసన

పాకిస్థాన్​ జెండాలతో వందల మంది హైకమిషన్​ వద్దకు చేరుకుని నిరసనల్లో పాల్గొన్నారు. భారత్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వందల మంది ఒక్కసారిగా కార్యాలయం వద్దకు చేరుకోవటం వల్ల పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్యాలయం వద్ద సామగ్రిని ధ్వంసం చేశారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు.

ఇదీ చూడండి: చంద్రయాన్​-2: రెండో సారి కక్ష్య తగ్గింపు విజయవంతం

Last Updated : Sep 29, 2019, 9:41 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details