తెలంగాణ

telangana

ETV Bharat / international

జలియన్​వాలా బాగ్​పై క్షమాపణకు బ్రిటన్​ విపక్షం హామీ - UK ELECTIONS

డిసెంబర్​ 12న జరగనున్న బ్రిటన్​ ఎన్నికల కోసం 107 పేజీల మేనిఫెస్టోను విడుదల చేసింది అక్కడి విపక్ష లేబర్​ పార్టీ. వందేళ్ల నాటి జలియన్​వాలా బాగ్ ఘటనపై భారత్​కు క్షమాపణలు చెప్తామని మేనిఫెస్టోలో పేర్కొంది.

జలియన్​వాలా బాగ్​పై క్షమాపణకు బ్రిటన్​ విపక్షం హామీ

By

Published : Nov 22, 2019, 5:31 AM IST

Updated : Nov 22, 2019, 7:58 AM IST

జలియన్​వాలా బాగ్​పై క్షమాపణకు బ్రిటన్​ విపక్షం హామీ

బ్రిటన్​ ఎన్నికల్లో భారత్​కు చెందిన అంశాలు ప్రధాన అస్త్రాలుగా నిలుస్తున్నాయి. కశ్మీర్​ సమస్య, వ్యాపార అంశాలపై ఇప్పటికే బ్రిటన్​ నేతలు విస్తృతంగా ప్రసంగిస్తున్నారు. తాజాగా జలియన్​వాలా బాగ్​ మారణహోమానికి భారత్​కు అధికారికంగా క్షమాపణలు చెప్తామని హామీనిచ్చారు విపక్ష లేబర్​ పార్టీ నేతలు. ఈ విషయాన్ని గురువారం విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

ఈ ఏడాది.. జలియన్​వాలా బాగ్​ దురాగతానికి వందేళ్లు నిండిన సందర్భంగా భారత్​కు అధికారిక క్షమాపణలు చెప్పడానికి బ్రిటన్​ ప్రభుత్వం సిద్ధపడింది. కానీ మాజీ ప్రధాని థెరెసా మే చివరి నిమిషంలో ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.

డిసెంబర్​ 12న జరగనున్న ఎన్నికల కోసం 107 పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు లేబర్​ పార్టీ నేత జెరెమీ కార్బిన్​. దీనికి 'ఇట్స్​ టైమ్​ ఫర్​ రియల్​ ఛేంజ్​' అని పేరు పెట్టారు.

గతంలో బ్రిటన్​ చేపట్టిన వలస పాలనపై ఆడిట్​ నిర్వహిస్తామని వాగ్దానం చేసింది లేబర్​ పార్టీ. 1984 అమృత్​సర్​లో జరిగిన 'ఆపరేషన్​ బ్లూ స్టార్​'లో బ్రిటన్​ పాత్రపై బహిరంగ సమీక్ష నిర్వహించడానికీ సిద్ధమని తెలిపింది.

ఆపరేషన్​ బ్లూ స్టార్​లో బ్రిటన్​ పాత్ర ఉందని చెబుతూ 2014లో కొన్ని కీలక పత్రాలు బయటపడ్డాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పలు సిక్కు సంఘాలు... విచారణ చేపట్టాలని డిమాండ్​ చేస్తున్నాయి.

ఇదీ చూడండి:- హిట్లర్ జ్ఞాపికలకు వేలంపాటలో రికార్డు ధర!

Last Updated : Nov 22, 2019, 7:58 AM IST

ABOUT THE AUTHOR

...view details