తెలంగాణ

telangana

ETV Bharat / international

నేడే బ్రిటన్​ ప్రధాని ఎన్నిక.. రేసులో జాన్సన్​, హంట్

బ్రిటన్​ నూతన ప్రధాని ఎవరన్నదీ నేడు తేలనుంది. సోమవారంతో ఓటింగ్​ ప్రక్రియ ముగిసింది. ఈ రోజు జరగనున్న ఓట్ల లెక్కింపు తర్వాత ప్రధాని ఎవరన్నదీ కన్సర్జేటివ్​ పార్టీ ప్రకటించనుంది. ప్రధానితోపాటు పార్టీ అధ్యక్ష రేసులో నాయకులు బోరిస్​ జాన్సన్​, జెరెమీ హంట్​ ముందున్నారు.

రేసులో జాన్సన్​, హంట్

By

Published : Jul 23, 2019, 6:45 AM IST

Updated : Jul 23, 2019, 4:28 PM IST

బ్రిటన్​ ప్రధాని ఎన్నిక తుది అంకానికి చేరుకుంది. సోమవారంతో కన్సర్వేటివ్​ సభ్యుల చివరి దశ ఓటింగ్ పూర్తయింది. ప్రధాని థెరిసా మే వారసులు ఎవరన్నదీ ఈ రోజు తేలనుంది. ప్రధాని పీఠం, అధికార కన్సర్వేటివ్​​ పార్టీ అధ్యక్ష పదవులకు ఆ పార్టీ నాయకులు బోరిస్​ జాన్సన్​, జెరెమీ హంట్ మధ్య ప్రధానంగా పోటీ ఉండనుంది.

సోమవారం జరిగిన ఓటింగ్‌లో కన్సర్వేటివ్ పార్టీలోని సుమారు 1.6 లక్షల మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ ఓట్ల లెక్కింపు నేడు ప్రారంభం కానుంది. అనంతరం జాన్సన్, హంట్‌ల్లో పార్టీ అధ్యక్షుడు, దేశ ప్రధాని కాబోయేదెవరో ఈ రోజు ప్రకటించనున్నారు.

అగ్రస్థానంలో జాన్సన్​

గత నెలలో జరిగిన ఎంపీల ఆఖరి బ్యాలెట్ ఓటింగ్‌లో బోరిస్ జాన్సన్ అగ్రస్థానంలో నిలిచారు. మొత్తం 313 మంది కన్సర్వేటివ్ ఎంపీల్లో 160 మంది ఓట్లను ఆయన సంపాదించారు. 77 ఓట్లతో హంట్ రెండో స్థానంలో నిలిచారు. మైఖేల్ గోవ్‌కు 75 ఓట్లు వచ్చాయి.

థెరిసా రాజీనామాతో...

బ్రిటన్ ప్రధాని పదవికి థెరెసా మే ఇటీవల రాజీనామా చేశారు. బ్రెగ్జిట్ విషయంలో సొంత పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే కన్సర్వేటివ్ పార్టీ మరో నాయకుడిని ఎన్నికునేందుకు సిద్ధమయింది.

థెరిసాతో జాన్సన్​ విభేదాలు

థెరిసా కేబినెట్‌లో విదేశాంగ మంత్రిగా పనిచేశారు జాన్సన్. థెరెసాతో విభేదాల నేపథ్యంలో గతేడాది ఆ పదవి నుంచి వైదొలిగారు. 2008 నుంచి 2016 వరకు ఆయన లండన్ మేయర్‌గా ఉన్నారు. ప్రస్తుతం హంట్ బ్రిటన్ విదేశాంగ మంత్రిగా ఉన్నారు. గోవ్ పర్యావరణ మంత్రిగా పనిచేస్తున్నారు.

సార్వత్రికానికి లేబర్​ పార్టీ డిమాండ్​

ప్రధాని ఎంపికపై ప్రతిపక్ష లేబర్​ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కొంత మంది ఎంపీల నిర్ణయంతో దేశ ప్రధానిని ఎన్నుకోవటాన్ని వ్యతిరేకిస్తోంది. సార్వత్రిక ఎన్నికలు నిర్వహించి ప్రజలకు నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడింది.

ఇదీ చూడండి: కశ్మీర్​ సమస్యలో మధ్యవర్తిత్వానికి సిద్ధం: ట్రంప్​

Last Updated : Jul 23, 2019, 4:28 PM IST

ABOUT THE AUTHOR

...view details