బ్రెగ్జిట్‌పై తిరిగి చర్చలు జరగాలంటే ఐరోపా సమాఖ్య(ఈయూ) నేతలు ఈ ఒప్పందంపై ఉన్న వ్యతిరేకతను పక్కనపెట్టాలని బ్రిటన్ నూతన ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కోరారు. బ్రిటన్ మాజీ ప్రధాని థెరిసా మే ప్రతిపాదించిన ఒప్పందంలో కొన్ని మార్పులు చేయడానికి బోరిస్ ఆలోచిస్తున్నప్పటికీ... అవసరమైతే ఎలాంటి ఒప్పందం లేకుండానే ఐరోపా సమాఖ్య నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
"ఒప్పందం జరుగుతుందని నేను నమ్మకంగా ఉన్నా. అలా జరగని పక్షంలో ఇతర(ఒప్పందం జరగకపోతే) పరిస్థితులకు సిద్ధపడటమూ మంచిదే."
--- బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధాని.
బ్రెగ్జిట్ విషయమై ఐరోపా సమాఖ్య నేతలతో బోరిస్ జరిపే చర్చలపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. అయితే నేతలు రాజీపడేంత వరకు చర్చలు జరపడానికి బ్రిటీష్ ప్రధాని సుముఖంగా లేరని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.