కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులతో అల్లాడుతున్న బ్రిటన్లో.. వైరస్ కట్టడి చేసే దిశగా మరో అడుగు పడింది. అమెరికా దిగ్గజ సంస్థ మోడెర్నా తయారు చేసిన కొవిడ్ టీకా అత్యవసర వినియోగానికి అక్కడి ఔషధ నియంత్రణ సంస్థ అధికారులు ఆమోదం తెలిపారు. దీంతో ఆ దేశంలో అనుమతి పొందిన మూడో టీకాగా మోడెర్నా నిలిచింది.
ఇప్పటికే.. 70 లక్షల మోడెర్నా టీకా డోసులను బ్రిటన్ మందస్తుగా ఆర్డర్ చేసింది. వసంత రుతువు అనంతరం ఈ టీకా డోసులు అక్కడ సరఫరా అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.