ఐరోపావ్యాప్తంగా పెరుగుతున్న దాడుల నేపథ్యంలో బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్ర ముప్పును గణనీయమై స్థాయి నుంచి 'తీవ్ర' స్థాయికి పెంచింది జాయింట్ టెర్రరిజం ఎనలైసిస్ సెంటర్.
ఇది ఆ దేశంలో రెండో అతిపెద్ద హెచ్చరిక. దీని ప్రకారం.. ఉగ్రదాడి జరిగే అవకాశం ముందుకన్నా ఎక్కువగా ఉందని అర్థం. దేశవ్యాప్తంగా పోలీసుల మోహరింపు, భద్రతా చర్యలు పెంచుతారు. అయితే ఇది ముందస్తు చర్యల్లో భాగమని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.