బ్రిటన్‌లోని నిగెల్ ఫరాగే నేతృత్వం వహిస్తున్న బ్రెగ్జిట్ పార్టీ పెద్ద ఎత్తున భారతీయ వలసదారులను ఆకర్షించింది. ఆ దేశ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో భారత సంతతి వ్యక్తులను రంగంలోకి దించింది.
లేబర్ పార్టీపైనే పోటీ..
గతంలో యాంటీ-ఈయూ ఇండిపెండెన్స్ పార్టీలో ఉన్న ఫరాగే... ఈ ఏడాది జనవరిలో బ్రెగ్జిట్ పార్టీ నెలకొల్పారు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలగడానికి పలుమార్లు గడువు మారినందున తమ పార్టీ అభ్యర్థులనే బరిలో నిలిపి పార్లమెంట్‌కు పంపేందుకు నిర్ణయం తీసుకున్నారు. బ్రెగ్జిట్ అనుకూలవాదుల ఓట్లను చీల్చకుండా ఉండేందుకు అధికార కన్సర్వేటివ్ పార్టీకి అభ్యర్థులపై పోటీకి దూరంగా ఉంటూ... ప్రతిపక్షాలైన లేబర్, లిబరల్ డెమొక్రాట్లకు పట్టున్న స్థానాల్లో పోటీకి సిద్ధమైంది బ్రెగ్జిట్ పార్టీ.