బ్రెగ్జిట్‌ను ఆమోదించలేదుగా.. ఎన్నికలకు సిద్ధంకండి: బోరిస్ బ్రిటన్ పార్లమెంట్.. బ్రెగ్జిట్ నూతన ఒప్పందాన్ని ఆమోదించని నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలంటూ ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్.. చట్టసభ్యులను హెచ్చరించారు. బ్రెగ్జిట్ నూతన ఒప్పందాన్ని పార్లమెంటులో రెండోసారి ప్రవేశపెట్టేందుకు విఫలయత్నం చేసిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ మేరకు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
"బ్రెగ్జిట్ బిల్లును ఆమోదించకుండా ఇంకా సాగదీస్తే.. మనం సాధారణ ఎన్నికలను ముందుగానే ఎదుర్కోవలసి ఉంటుంది."
- బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధాని
బ్రెగ్జిట్ 3 నెలలు వాయిదా!
బ్రెగ్జిట్‌కు మరో 9 రోజుల సమయమున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు పార్లమెంట్లో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. బ్రెగ్జిట్ నూతన ఒప్పందాన్ని పార్లమెంటులో రెండోసారి ప్రవేశపెట్టేందుకు సభాపతి జాన్ బెర్కో నిరాకరించారు.
బ్రస్సెల్స్‌లో జరగనున్న ఐరోపా నేతల భేటీ సందర్భంగా బ్రెగ్జిట్‌కు మరో 3 నెలలు వాయిదా వేయాలని సభలో ఎంపీలు నిర్ణయించారు. ఈ మేరకు సభాపతి జాన్ బెర్కో ఐరోపా నేతలకు ఓ లేఖ రాశారు.
అక్టోబర్ 31న ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలగాల్సి ఉంది. ఎలాగైనా బ్రెగ్జిట్ ఒప్పందాన్ని ఆమోదించుకోవాలని పట్టుదలతో ఉన్న బోరిస్‌కు బెర్కో నిర్ణయం ఆశనిపాతంగా పరిణమించింది.
ఇదీ చూడండి:నిరసన తెలిపేందుకే సెలవు ప్రకటించిన ప్రభుత్వం!