ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / international

'థెరెసా మే'కు మరోసారి పరాభవం - థెరెసా

బ్రిటన్​ ప్రధాని థెరెసా మే ప్రతిపాదించిన బ్రెగ్జిట్​ ఒప్పందం పార్లమెంట్​లో​ రెండోసారి తిరస్కరణకు గురైంది. చట్టసభ సభ్యుల తీరుపై థెరెసా విచారం వ్యక్తం చేశారు.

యూకే పార్లమెంటు
author img

By

Published : Mar 13, 2019, 9:09 AM IST

బ్రెగ్జిట్​ ఒప్పందంపై బ్రిటన్​ ప్రధాని 'థెరెసా మే'కు పార్లమెంట్​లో మరోసారి పరాభవం తప్పలేదు. మే ప్రతిపాదించిన బ్రెగ్జిట్​ ఒప్పందం పార్లమెంట్​లో రెండోసారి తిరస్కరణకు గురైంది.

యూకే పార్లమెంటు

391 మంది సభ్యులున్న బ్రిటన్​ దిగువ సభ (హౌజ్​ ఆఫ్​ కామన్స్)​లో 242 మంది మే ప్రతిపాదనను వ్యతిరేకించారు. థెరెసా పార్టీకి చెందిన 75 మంది కన్సర్వేటివ్​​ ఎంపీలు సైతం ఆమె ప్రతిపాదనను తిరస్కరించారు.

బ్రెగ్జిట్​ ప్రతిపాదనలు వీగిపోవటంపై థెరెసా విచారం వ్యక్తం చేశారు. సమాఖ్య నుంచి విడిపోయిన అనంతరం జరిగే పరిణామాలపై తనకు అవగాహన ఉందని, కానీ చట్టసభ సభ్యుల ప్రవర్తన మాత్రం విచారంగా ఉందని వ్యాఖ్యానించారు.

థెరెసా ప్రతిపాదనలు ఇక పూర్తిగా ముగిసినట్లేనని లేబర్​ పార్టీ ప్రకటించింది. ఐరోపా సమాఖ్య నుంచి వైదొలిగే ప్రక్రియపై బుధవారం చర్చించనున్నారు. యురోపియన్​ యూనియన్​ నుంచి మరో రెండు వారాల్లో బ్రిటన్​ వైదొలగనుంది.

ఇదీ చూడండి:అంకుర సంస్థలకు ఫేస్​బుక్​ ఊతం..

ABOUT THE AUTHOR

...view details