బ్రిటన్ను డెన్నిస్ తుపాను వణికిస్తోంది. వారం రోజుల నుంచి విపరీతంగా కురుస్తున్న వర్షాలకు అక్కడి ప్రభుత్వం ఐదు తీవ్రమైన వరద ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది. బ్రిటన్ ప్రజలు వరద ముప్పు ముంగిట ఉన్నట్లు తెలిపింది.
గంటకు 145 కిలోమీటర్ల వేగంతో...
బ్రిటన్ వాతావరణ శాఖ ఇంగ్లాండ్ వ్యాప్తంగా 221, వేల్స్ ప్రాంతంలో 24, స్కాట్లాండ్లో 12 వరద ప్రమాద హెచ్చరికలను జారీచేసింది. కొద్దిరోజులుగా గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు తెలిపింది.
డెన్నిస్ తుపాను: తీవ్ర వరద ముప్పులో బ్రిటన్! జర్మనీలోనూ...
ఉత్తర ఐరోపాలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల వల్ల విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. జర్మనీ వరదలు ముంచెత్తుతున్నాయి. ప్రతికూల వాతావరణం వల్ల ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో 9 మందికి గాయాలయ్యాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వానల వల్ల నోర్డిక్, బాల్టిక్ ప్రాంతాలు జలమయమయ్యాయి. బాల్టిక్ ప్రాంతంలో దాదాపు 1200 ఇళ్లు అంధకారంలో చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. నార్వేలో వరదల ధాటికి పలు రహదారులు దిగ్బంధమయ్యాయి.