పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)ను మోసం చేసిన కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. నేడు లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరయ్యారు. నీరవ్‌ను భారత్‌కు అప్పగించాలన్న పిటిషన్‌పై వాదనలు ఆలకించింది న్యాయస్థానం. వాదనల తర్వాత నీరవ్ మోదీ కస్టడీని పొడిగిస్తూ తీర్పునిచ్చింది. ప్రస్తుతం వాండ్స్‌వర్త్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నీరవ్... జూన్ 27 వరకు పోలీసుల నిర్బంధంలోనే ఉండాలని ఆదేశించింది. తదుపరి విచారణ జులై 29న జరుపుతామని స్పష్టం చేసింది. బెయిల్ కోసం ఇప్పటికే నీరవ్ మోదీ మూడు సార్లు ప్రయత్నించినా కోర్టు తిరస్కరించింది.
నీరవ్ కస్టడీ పొడిగించిన లండన్ కోర్టు - UK court
పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కస్టడీని పొడిగించింది లండన్ కోర్టు. జూన్ 27 వరకు పోలీసుల నిర్బంధంలోనే ఉండాలని ఆదేశించింది. నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాలన్న పిటిషన్‌పై తదుపరి విచారణ జులై 29న జరుపుతామని తెలిపింది.
నీరవ్ మోదీ కస్టడీని పొడిగించిన లండన్ కోర్టు
పీఎన్బీతో పాటు భారత్‌లోని ఇతర బ్యాంకులను రూ.14వేల కోట్ల మేర మోసగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీని.. మార్చి 19న స్కాట్లాండ్ యార్డ్ అధికారులు లండన్‌లో అదుపులోకి తీసుకున్నారు. నీరవ్‌ను స్వదేశానికి రప్పించేందుకు భారత్ విస్తృత ప్రయత్నాలు చేస్తోంది.
ఇదీ చూడండి : 'గంగలో మునిగితే ఇక అంతే సంగతులు'