బ్రిటన్ రాజప్రసాదంలో తమకు అప్పగించిన బాధ్యతల నుంచి యువరాజు దంపతులు హ్యారీ, మేఘన్ తప్పుకోవాలనుకోవడంపై స్పందించారు ట్రంప్. యువరాజు, యువరాణి నిర్ణయం బాధాకరమన్నారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్‌కు తన విచారాన్ని వ్యక్తం చేశారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయంపై మాట్లాడారు.
ప్రిన్స్ హ్యారీ నిర్ణయం బాధాకరం: ట్రంప్
బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ, మేఘన్ దంపతులు తీసుకున్న నిర్ణయంపై విచారం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. బ్రిటన్ రాజ కుటుంబ బాధ్యతల నుంచి వారు తప్పుకోవాలనుకోవడం బాధాకరమన్నారు.
ప్రిన్స్ హారీ నిర్ణయం బాధాకరం: ట్రంప్
" రాణి ఎలిజబెత్ ఎంతో గొప్ప మహిళ. ఆమె ఎప్పుడూ ఏ తప్పూ చేయలేదు. ఆమె హయాంలో మచ్చలేని పాలన సాగిందని నా అభిప్రాయం. నేను ఈ విషయంలోకి పూర్తిగా వెళ్లాలనుకోవట్లేదు. నాకు బ్రిటన్ రాణి పట్ల ఎంతో గౌరవం ఉంది. ఆమె విషయంలోనే ఇలాంటి సంఘటన జరుగుతుందనుకోలేదు. "
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
Last Updated : Jan 11, 2020, 3:53 PM IST