తెలంగాణ

telangana

'మూడు పొరల వస్త్ర మాస్కు మంచిదే'

కొవిడ్‌-19 నుంచి రక్షణ పొందడానికి సర్జికల్‌ మాస్కులు మాత్రమే పెట్టుకోవాల్సిన అవసరం లేదని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ముఖానికి సరిగా అమరిన, మూడు పొరలు కలిగిన వస్త్ర మాస్కునూ పెట్టుకోవచ్చని చెప్పారు.

By

Published : Apr 30, 2021, 6:15 AM IST

Published : Apr 30, 2021, 6:15 AM IST

three layerd mask
మూడు పొరల వస్త్ర మాస్కు

కరోనా నుంచి రక్షణకు సర్జికల్​ మాస్కులు మాత్రమే ధరించాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. మూడు పొరలు కలిగిన వస్త్ర మాస్కునూ పెట్టుకోవచ్చని చెప్పారు. ఇది కూడా సర్జికల్‌ మాస్కు స్థాయిలో పనిచేస్తుందన్నారు. మాస్కుల సమర్థతను పరీక్షించే ఉద్దేశంతో బ్రిస్టల్‌, సరే విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించారు. దీన్ని ధరించిన వారి శ్వాసలోని గాలి.. మాస్కు లోపల మెలికలు తిరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఫలితంగా వైరస్‌తో కూడిన తుంపర్లు గాలి వెళ్లే మార్గం గుండా వెళ్లలేవని తెలిపారు. అవి మాస్కులోని పోగులను ఢీకొట్టి ఆగిపోతాయని చెప్పారు.

సరిగ్గా ధరించిన మూడు పొరల వస్త్ర మాస్కు.. వైరస్‌ నుంచి 50- 70 శాతం వరకూ రక్షణ కల్పిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి :ప్రధాని నేతృత్వంలో నేడు కేంద్ర మంత్రిమండలి భేటీ

ABOUT THE AUTHOR

...view details